ఎదుగుతున్నదశలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి !

“మరో స్థాయికి వెళ్తున్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే కెరీర్‌ కిందమీదవుతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకుని వేరే వారిని నిందించకూడదు. మన తప్పుకు మనమే బాధ్యత వహించాలి …. అని అంటోంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఇటీవల ‘దే దే ప్యార్‌ దే’ తో సక్సెస్‌ ఆనందంలో ఉన్న రకుల్‌… ఈ నెల 15న విడుదల కానున్న ‘మర్జావాన్‌’ లో నటించింది . అర్జున్‌కపూర్‌కు జోడీగా మరో హిందీ చిత్రానికి ఓకే చెప్పింది .ఇప్పుడు బాలీవుడ్‌ లో స్పీడ్‌ పెంచుతున్నట్లుంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. బాలీవుడ్‌ కెరీర్‌ గురించి రకుల్‌ మాట్లాడుతూ….
 
‘‘ఇప్పుడు బాలీవుడ్‌పై కూడా దృష్టి పెట్టాలనుకున్నాను. పాతిక చిత్రాలు దక్షిణాదిలో పూర్తి చేశాను. నటిగా నన్ను బాగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అలాగని దక్షిణాది సినిమాలు చేయనని కాదు. కథ..అందులోని నా పాత్రను బట్టి సినిమాలు  చెయ్యాలని నిర్ణయించుకుంటాను. కెరీర్‌ ఆరంభంలో మాత్రమే కాదు.. మరో స్థాయికి ఎదుగుతున్నప్పుడు కూడా… సరైన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే కెరీర్‌ లో ఇబ్బంది కలుగుతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకుని, వేరే వారిని నిందించడం తగదు… మన తప్పుకు మనదే బాధ్యత. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ప్రస్తుతం హిందీలో మరో మూడు ప్రాజెక్ట్స్‌ గురించి చర్చలు జరుగుతున్నాయ’’ని చెప్పింది.
 
‘భారతీయుడు 2’ కోసం ఎగ్జైటింగ్‌గా..
కమల్‌ సార్‌ తో చేస్తున్న ‘భారతీయుడు 2′ కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. ఇందులో నేను సిద్ధార్థ్‌కి జోడీగా కనిపిస్తా’ అని రకుల్‌ ప్రీత్‌ తెలిపింది. రకుల్‌ తాజాగా నటిస్తున్న హిందీ చిత్రం ‘మర్జావాన్‌’ ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా రకుల్‌ మాట్లాడుతూ…
“ఇందులో ఆర్జోగా కనిపిస్తాను. సెక్స్‌ అప్పీల్‌ ఉన్న పాత్ర నాది. ‘ముకుద్దార్‌ కా సికందర్‌’ చిత్రంలో రేఖ పాత్రలా ఉంటుంది.ఆమెని మరిపించేలా ప్రయత్నిస్తున్నా. తారా సుతారియా నటిస్తున్న జోయా పాత్ర.. నాపాత్రా దేనికదే భిన్నంగా.. చాలా గొప్పగా ఉంటాయి. నా పాత్ర ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుంది. కమల్‌ ‘భారతీయుడు 2’ కోసం ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. ఇందులో ఫ్లాష్‌బ్యాక్‌లో కమల్‌ జోడీగా కాజల్‌.. ప్రస్తుత ఎపిసోడ్‌లో సిద్ధార్థ్‌కి జోడీగా నేను నటిస్తున్నాం. ఈ ఐదేళ్ళలో దాదాపు 30 సినిమాల్లో నటిస్తూ .. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నా. ప్రేమించడానికి, డేటింగ్‌ చేయడానికి టైమ్‌ లేదు. తాజాగా నాలుగు సినిమాలకు సైన్‌ చేశా” అని చెప్పింది . ప్రస్తుతం ‘భారతీయుడు 2’, ‘మర్జావాన్‌’తోపాటు తమిళంలో శివ కార్తీకేయన్‌ తో ఓ సినిమాలో రకుల్‌ నటిస్తోంది.