అందుకనే ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట!

హద్దులు దాటేసిన రకుల్‌.. హద్దులంటే ఎక్స్‌పోజింగ్‌కు హద్దులన్నమాట. రకుల్‌ సినీరంగానికి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, ఎప్పుడూ హద్దులు దాటి అందాల ఆరబోయలేదు. ఎక్స్‌పోజింగ్‌కి సున్నితంగానే నో చెప్పేది. అలాంటిది ‘మన్మథుడు 2’లో మాత్రం ఝాన్సీ తో ముద్దులతో సహా..రకుల్‌ అందాల ఆరబోతకు హద్దులు లేకుండా పోయింది. కారణం…రెమ్యునరేషనే అంటున్నారు. ఏ సినిమాకూ తీసుకోనంత మొత్తం ఈ సినిమాకు తీసుకుందట! దాదాపు కోటిన్నర దాకా రకుల్‌కి ముట్టచెప్పారట! అందుకే ఎక్స్‌పోజింగ్‌కి రకూల్‌ ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని అంటున్నారు. రకూల్‌ అందాల ఆరబోత ఈ సినిమాకే పరిమితమా ? లేక ఇక నుంచి అన్ని సినిమాల్లోనూ ఇలాగే కనిపిస్తుందా? అన్న విషయంలో మాత్రం సినీ జనాలకు క్లారిటీ రాలేదు.
ప్రత్యేకంగా బెల్లీ డ్యాన్స్‌లో శిక్షణ
హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ నటించిన తాజా చిత్రం ‘మన్మధుడు 2’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో విరివిగా పాల్గొన్న రకుల్ సిగరెట్ కాల్చితే తప్పేంటి? అని కొన్ని బోల్డ్ కామెంట్స్ కూడా చేయడం గమనార్హం. కాగా ఆమె నటించిన హిందీ చిత్రం ‘దే దే ప్యార్ దే’ అక్కడ మంచి విజయాన్ని అందుకొని ఈ ఏడాది బాలీవుడ్‌లో టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. దీంతో ఈ భామకు బాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయి.
 
అయితే ఆసక్తిరమైన విషయం ఏమిటంటే.. రకుల్ హిందీలో నటిస్తున్న ఓ చిత్రం కోసం బెల్లీ డ్యాన్స్ నేర్చుకుంటోందట. ‘మార్జావాన్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్న ఈ భామ ఓ సన్నివేశంలో బెల్లీ డ్యాన్స్ చేయాల్సి ఉండటంతో ఆ సన్నివేశంలో పర్ఫెక్షన్ కొరకు ఆమె బెల్లీ డాన్స్ నేర్చుకుంటోందని తెలిసింది. ఏదో సన్నివేశం చేశామా, అయిపోయిందా? అని కాకుండా పాత్ర కొరకు రకుల్‌ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా ఈ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటుండడం విశేషం.