సక్సెస్ లేకపోయినా.. డిమాండ్ తగ్గలేదు !

తెలుగులో సరైన సక్సెస్ లేనప్పటికీ .. ఏకకాలంలో పలు భాషల్లో సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది రకుల్ ప్రీత్ సింగ్.ఆశ్చర్యపరుస్తోంది. దర్శకనిర్మాతలు సైతం రకుల్ వైపే చూస్తుండటం విశేషం. దీంతో రెమ్మ్యూనరేషన్ డిమాండ్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తోందట రకుల్ . ‘మన్మథుడు 2’ సినిమా డిజాస్టర్ తర్వాత ఆమె కెరీర్ కాస్త స్లో అయినా కూడా బాలీవుడ్, టాలీవుడ్ నుంచి ఆమెకు అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

తెలుగులో ఇటీవలే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను పూర్తి చేసింది రకుల్. ఇందులో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో కలిసి నటించింది. అదేవిధంగా నితిన్ హీరోగా రూపొందుతున్న ‘చెక్’ సినిమాలో కూడా హీరోయిన్‌గా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఇకపోతే తమిళ్‌లో ‘ఇండియన్ 2’లో కాజల్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న రకుల్.. ఇటీవలే శివకార్తీకేయన్‌తో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

సౌత్ సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ దక్కించుకుంటోంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఈ అమ్మడికి ఆయుష్మాన్ ఖురానా హీరోగా రాబోతున్న ‘డాక్టర్ జీ’ అనే కొత్త సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కింది. మెడికల్ కాలేజీ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో డాక్టర్ ఫాతిమాగా రకుల్ నటించనుందని చిత్రయూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.

బాలీవుడ్‌లో హవా!… టాలీవుడ్‌పై ఫోకస్‌ తగ్గించిన హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో పాగా వేశారు. హిట్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బీటౌన్‌లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే హిందీలో ‘యారియాన్’, ‘అయ్యారే’, ‘దేదే ప్యార్ దే’ వంటి మూడు సినిమాల్లో నటించినప్పటికీ ఏదీ కూడా రకుల్‌కు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించలేకపోయాయి. అయినప్పటికీ మరో రెండు బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అజయ్‌ దేవగన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మే డే’లో రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అదే విధంగా అజయ్‌ దేవగన్‌ ‘థాంక్‌ గాడ్‌’ లోనూ ఈ మద్దుగుమ్మ నటిస్తున్నారు.తాజాగా బాలీవుడ్‌ యువ నటుడు ఆయుష్మాన్‌ ఖురానాతో కలిసి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జోడి కట్టనున్నారు. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న చిత్రం ‘డాక్టర్‌ జీ’. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్‌ డాక్టర్‌ ఉదయ్‌ పాత్రలో కనిపించనుండగా.. ఆయన సీనియర్‌గా రకుల్‌ డాక్టర్‌ ఫాతిమా పాత్ర పోషించనున్నారు. ఈ సినిమాను అనుభూతి కశ్యప్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్‌లో ”థ్యాంక్‌గాడ్‌, సర్దార్‌ అండ్‌ గ్రాండ్‌సన్‌, మేడే, ఎటాక్‌” సినిమాలకు కమిటై బిజీగా ఉన్న రకుల్.. తాజాగా ‘డాక్టర్‌ జీ’ సినిమాలో ఛాన్స్ కొట్టేయడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఏదేమైనా కోటిన్నర మేర రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నా కూడా రకుల్‌కి వరుస ఆఫర్స్ దక్కుతున్నాయంటే ఈ ఏడాది అమ్మడి హవా ఓ రేంజ్‌లో ఉందో చూడండి.