చెప్పింది ఇవ్వకపోతే ఒప్పుకునేది లేదు!

రకుల్‌ప్రీత్‌సింగ్‌ …”ఆ విషయంలో ఎవరేమనుకున్నా డోంట్‌కేర్‌” అని తెగేసిచెబుతోంది. తక్కువ కాలంలోనే డబ్బు సంపాదించేసి…నటిగానే కాకుండా సొంతంగా జిమ్‌ల నిర్వహణ, వాణిజ్య ప్రకటనలు, షాపుల ప్రారంభోత్సవాలు… వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా ఆమె ఎడాపెడా డబ్బు కూడపెట్టేస్తోంది. రకుల్‌ పక్కా కమర్షియల్ అని అందరికీ అర్ధమయ్యింది.. తెలుగులో ఈ మధ్య బిజీ హీరోయిన్‌గా ఉన్నాా..వరుస ఫ్లాప్‌ల కారణంగా ఇప్పుడు డిమాండ్ తగ్గిపోయింది.
కోలీవుడ్‌లో.. బాలీవుడ్ లో సక్సెస్‌ కోసం పోరాడుతూనే ఉంది. రకుల్‌ప్రీత్‌సింగ్‌ తెలుగులో పేరు తెచ్చుకోవడంతో… తమిళసినిమా ఆమెపై దృష్టి మరల్చింది. అయితే ‘ధీరన్‌ అధికారం ఒండ్రు’ (ఖాకీ) చిత్రం మినహా ఇక్కడ సక్సెస్‌లు పొందలేకపోయింది. అయితే, తాజాగా స్టార్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో విశ్వనటుడు కమలహాసన్‌తో జతకట్టే అవకాశం తో జాక్‌పాట్‌ కొట్టేసింది. ఈ సినిమాలో నటి కాజల్‌అగర్వాల్‌ కూడా నటిస్తోంది.
 
కొత్తగా ఏదో ఒకటి చేస్తాను
“ఇదే నా హద్దు. ఇంత వరకే నేను చేయగలను” అన్న నిర్ణయానికి రావడం నాకు నచ్చదు. నిత్యం కొత్త ప్రయత్నాలు చేయాలని కోరుకుంటాను. నిన్నలానే నేడూ జరిగితే ..అందులో విశేషం ఏముంటుంది. ప్రతి నిత్యం కొత్తగా ఏదో ఒకటి చేస్తాను. అదే సినిమాల్లో నన్ను ఇంత కాలం ఉంచింది. ఆరోగ్యానికి, వ్యాయామానికి ప్రాముఖ్యతనిస్తాను. నేను భోజనప్రియురాలిని. ఎంత తింటానో, అంతగా కసరత్తులు చేస్తాను.
పారితోషికం విషయంలో నేను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటానని కొంత మంది చెప్పుకుంటున్నారు. పాత్ర కోసం ఎంతగా శ్రమించాలో అంతగా శ్రమించడానికి రెడీ. ఇక పారితోషికం విషయానికి వస్తే… ఎంత ఇవ్వగలరన్నది ముందుగా అనుకుంటాము.అలా అంగీకరించిన పారితోషికాన్ని చెల్లించకపోతే మాత్రం ఒప్పుకునేది లేదు. అది నాకు నచ్చదు. ‘రకుల్‌ పారితోషికం విషయంలో ఖరాఖండీగా ఉంటుంది’ అని చేసే విమర్శలను కేర్‌ చేయను” అని అంటోంది ఈ బ్యూటీ
 
ఆమెకు వారిద్దరంటే ఇష్టమట
ఎన్టీఆర్, చరణ్, మహేష్, అల్లు అర్జున్.. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించిన రకుల్‌ప్రీత్ కు ‘యూత్ స్టార్’ విజయ్ దేవరకొండ అంటే ఇష్టమట. ఈ విషయాన్ని మంచు లక్ష్మి ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ ప్రోగ్రామ్‌లో రకుల్ చెప్పింది. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రకుల్ వంటి వారు… సాధారణంగా ఇష్టమైన హీరో అంటే తను నటించిన స్టార్స్‌లో ఎవరో ఒకరి పేరు చెప్పాలి. అలాంటిది నయా హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పడం విశేషం.
బాలీవుడ్‌లో ఆమెకు రణ్‌బీర్ సింగ్ అంటే ఇష్టమట. ప్రస్తుతం రకుల్‌ప్రీత్ తమిళంలో కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ లో నటిస్తోంది. ఇదే రకుల్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్. ఆమె ఫేట్‌ని మార్చాల్సిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరో సిద్దార్ధ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో రకుల్ కూడా పాల్గొంటున్నట్లు తెలిసింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు