మొదటి మెట్టు నుంచి తిరిగి ప్రారంభించాల్సిందే!

“బాలీవుడ్ లో సక్సెస్‌ కావాలంటే కెరీర్‌ను తిరిగి మొదటి మెట్టు నుంచి ప్రారంభించాల్సిందేన”ని.. అంటోంది ప్రముఖ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్.‌ పలువురు దక్షిణాది కథానాయికల లక్ష్యం బాలీవుడ్‌. హిందీ లో సక్సెస్‌ అయితే దేశవ్యాప్తంగా ఫాలోయింగ్‌ తో పాటు కెరీర్‌ మరింత ఉజ్వలంగా ఉంటుందని భావిస్తారు. అయితే బాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకోవడం అంత సులభం కాదని అంటోంది రకుల్‌ప్రీత్‌సింగ్‌. దక్షిణాదిలో స్టార్‌ గా ఉన్నప్పటికీ సినిమా అవకాశాల విషయంలో బాలీవుడ్‌ లెక్కలు వేరేగా ఉంటాయని చెప్పింది. ‘దక్షిణాది కథానాయిక స్టార్‌డమ్‌ గురించి బాలీవుడ్‌ పరిశ్రమలో పెద్దగా పట్టించుకోరు. ఈ విషయంలో ఎవరినీ నిందించలేం. నాకు భోజ్‌పురి, బెంగాలీ నటులు అంతగా తెలియదు. అంత మాత్రాన వారికి పేరుప్రతిష్టలు లేవనికాదు. అలాగే బాలీవుడ్‌ లో నా గురించి తెలిసి ఉండాలని కోరుకోవడం కూడా తప్పే. దక్షిణాదిలో నేను 20 సినిమాలు చేశానని చెప్పుకుంటేనే.. అక్కడి వాళ్లు తెలుసుకుంటారు. హిందీలో సక్సెస్‌ కావాలంటే కెరీర్‌ను తిరిగి మొదటి మెట్టు నుంచి ప్రారంభించాల్సిందే’ అని చెప్పింది రకుల్ .
 
హైద‌రాబాద్ కు మ‌కాం మార్చింది!
ముంబైలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోన్న విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్ లో కూడా క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎక్క‌డో ఓ ద‌గ్గ‌ర ఉండాలి కదా.. మ‌రి ఇలాంటి సమయంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హైద‌రాబాద్ కు మ‌కాం మార్చింద‌ట‌. ర‌కుల్‌ప్రీత్ సింగ్ సినిమాలే కాకుండా ప్ర‌త్యామ్నాయ వ్యాపారాల్లో కూడా ఉన్న‌విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్ లో సొంతంగా జిమ్ ట్రైనింగ్ సెంట‌ర్ ను నిర్వ‌హిస్తోంది. మ‌రోవైపు వైజాగ్ లో కూడా ఫిట్ నెస్ సెంట‌ర్ ను ఏర్పాటు చేసుకుంది. హైద‌రాబాద్ లో రియ‌ల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబ‌డులు కూడా పెట్టింద‌ట‌. క‌రోనా ఉధృతి పెరుగుతున్న నేప‌థ్యంలో హైద‌రాబాద్ లో కొనుగోలు చేసిన ల‌గ్జ‌రీ అపార్టుమెంట్ కు మ‌కాం మార్చిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో చెప్పుకుంటున్నారు..
 
వెబ్‌ సీరీస్‌లో నటించేందుకు ఓకే !
ఓటీటీలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండటంతో సినిమా ఇండస్ట్రీ దృష్టి ఇప్పుడు వాటిపై పడింది. అందుకే స్టార్‌ హీరోలు, హీరోయిన్లు, ప్రముఖ దర్శకులు, పేరున్న నిర్మాణ సంస్థలు సైతం డిజిటల్‌ వేదికవైపు అడుగులేస్తున్నారు. సమంత, తమన్నా, కాజల్‌ అగర్వాల్‌ వంటి స్టార్‌ హీరోయిన్లు ఇప్పటికే వెబ్‌ సిరీస్ లో చేస్తూ న్నారు. ఈ జాబితాలోకి తాజాగా హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ చేరుతోందట. ఆమె ఓ వెబ్‌ సీరీస్‌లో నటించేందుకు ఓకే అందట. ఇందులో రకుల్‌ ద్విపాత్రాభినయం చేయనుందట. అది కూడా కవలలుగా నటించనున్నారని..వారు ప్రతి విషయంలోనూ నువ్వా? నేనా? అన్నట్టు ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారని, ఆ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా సాగుతాయని తెలుస్తోంది‌. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ ‌డబుల్‌ రోల్‌ చేయని రకుల్ రెండు పాత్రల్లో అభిమానులకు ఆనందమే కదా!