నా ఫిగర్‌, ఫిట్‌నెస్‌ బాగుంది కనుక అలా చేసా !

సౌత్‌లో ‘కాస్త’ పద్ధతిగల పాత్రల్లో నటించిన రకుల్‌ ఓ ఫొటో షూట్‌లో ఒక్కసారిగా  ‘అలా’ కనిపించేసరికి ఫాన్స్ షాక్అయ్యారు. ఇటీవల ఓ మ్యాగజైన్‌ కవర్‌పేజీ కోసం రకుల్‌ ఇచ్చిన ఫొటో షూట్‌ చర్చనీయాంశమైంది. దాని గురించి రకుల్‌ మాట్లాడుతూ…. ‘‘ఈ మధ్యన ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫోటోషూట్‌ చూసి జనాలంతా అవాక్కయ్యారు.నన్ను గాళ్‌ నెక్ట్స్‌ డోర్‌ అన్నవాళ్లే ఒక్క షూట్‌తో ‘హాట్‌ గాళ్‌’ అనే బిరుదు ఇచ్చేశారు. ఆ ఫోటోషూట్‌పై కొందరు సానుకూలంగా కూడా కామెంట్లు చేశారు. ఎవరి అభిప్రాయం వారిది. పాజిటివ్‌ కామెంట్లకు మురిసిపోవటం.. నెగటివ్‌ కామెంట్లకు కుంగిపోవటం నాకు అలవాటు లేదు.అసలు ఆ కామెంట్లను చదివేందుకు నాకు ఆసక్తి, తీరిక రెండూ లేవు.

పక్కింటి అమ్మాయి పాత్రల్లో మాత్రమే నటించాననీ, గ్లామర్‌ పాత్రల అవకాశం కోసం హాట్‌ ఫొటో షూట్‌ చేశానని అంటున్నారు. నాకు అలాంటి ఆలోచన లేదు. తెలుగులో చాలా పాటల్లో హాట్‌గా కనిపించాను. కాబట్టి గ్లామర్‌గా కనిపించడం నాకు కొత్తేమీ కాదు. నా ఫిగర్‌, ఫిట్‌నెస్‌ బావున్నప్పుడు కవర్‌పేజ్‌పై నా ఫొటో ఉండటంలో తప్పులేదనిపించింది. ఏ హీరోయిన్‌ అయినా సరే జీవితంలో ఒక్కసారైనా మ్యాగజైన్‌లకు పోజులివ్వకుండా ఉండరు. నాకూ ఆ అవకాశం దక్కింది.. వాడుకున్నా.  నేను చేసే పని నాకు నచ్చింది. నా కుటుంబ సభ్యులకే అభ్యంతరం లేనప్పుడు.. వారికి ఎందుకు ఉంటుందో అర్థం కావట్లేదు. ఎవరేమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం నాకైతే లేదు’ అని రకుల్‌ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యల తర్వాత కూడా తనను కొందరు విమర్శించే అవకాశం లేకపోలేదని.. కానీ, వాటిని కూడా తాను పట్టించుకోన”ని ఆమె తెలిపింది.

ఇక కాస్టింగ్‌ కౌచ్‌ పై స్పందిస్తూ…. తానెప్పుడూ అలాంటి వేధింపులు ఎదుర్కోలేదని.. టాలీవుడ్‌లో కొత్త ప్రాజెక్టులకు అంగీకరించకపోవటంపై వస్తున్న విమర్శలపై స్పందించింది. తెలుగులో మంచి కథలు దొరక్కపోవటంతోనే తాను ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదని.. బాలీవుడ్‌, కోలీవుడ్‌లో వరుసగా అవకాశాలు వచ్చినా టాలీవుడ్‌ మాత్రం తనకు సొంతిల్లు లాంటిదని రకుల్‌ వివరించింది. నీరజ్‌ పాండే దర్శకత్వం వహించిన రకుల్ హిందీ చిత్రం ‘అయ్యారీ’ ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అయ్యింది. ఈ చిత్రంలో సిధార్థ్‌ మల్హోత్రా, మనోజ్‌ బాజ్‌పాయి, రకుల్‌ ప్రధాన పాత్రలు పోషించారు.