ఈమె దూకుడు మామూలుగా లేదంటున్నారు !

చాలామంది హీరోలు తమ లాంగ్వేజ్ మూవీస్ లోనే యాక్ట్ చేస్తే హీరోయిన్స్ మూడు నాలుగు భాషా చిత్రాల్లో నటిస్తుంటారు. ఒక లాంగ్వేజ్ లో కాస్త డౌన్ ఫాల్ వచ్చినా ఇంకో భాషలో కవర్ చేసుకోవచ్చు. సినిమా అవకాశాలకోసం హీరోల కన్నా హీరోయిన్స్ ఎక్కువగా పోటీ పడుతున్నారనే చెప్పాలి. కొందరు భామలకు అన్ని భాషా చిత్రాల్లోనూ ఛాన్సులు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ పని మూడు సినిమాలు.. ఆరు రిలీజ్ లు అన్నట్టుగా ఉంది. వరుస విజయాలతో రాణిస్తున్న కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఆమె కథానాయికగా ఈ మధ్యకాలంలో విడుదలైన చిత్రాలు ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ వంటివి మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఆమె మహేశ్‌బాబుతో ‘స్పైడర్‌’లో నటిస్తున్నారు.

ఇప్పుడు రకుల్ స్పీడ్ చూసి మిగతా కథానాయికలు కంగారు పడిపోతున్నారు. తెలుగులో అగ్రహీరోలతో కంటిన్యూగా సినిమాల్లో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తమిళంలో కార్తీ సరసన ‘ధీరమ్ అధిగారం ఒండ్రు’ మూవీ చేస్తుంది . సూర్య సరసన కూడా మూవీ ఛాన్స్ కొట్టేసింది. సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో సూర్య హీరోగా ఒక భారీ సినిమా ప్రాజెక్ట్ కు ఏర్పాట్లు చేస్తుండగా ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే విజయ్ సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకున్న ఈమె హిందీలోను పావులు కదుపుతోంది. పరిశ్రమలోని వారు రకుల్ భామ దూకుడు మాములుగా లేదంటున్నారు.

విజయానికి పొంగిపోయి, అపజయానికి కుంగిపోను!

‘నిజాయతీగా చెబుతున్నా.. ఇప్పుడు నేను మురిసిపోవడం లేదు. ఎందుకంటే.. సినిమా హిట్‌ నాకు సంతోషాన్ని ఇవ్వదు, ఫెయిల్‌ నన్ను బాధించదు. మురిసిపోవడం నాకు కొంచెం కష్టమే. సినిమా హిట్‌ను ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలో కూడా నాకు తెలియదు. మనం చేసిన పనికి గుర్తింపు లభించడం చాలా గొప్ప విషయం. కానీ, నేను తర్వాత ఏంటి? అని ఆలోచిస్తూ ఉంటాను’ అని చెప్పుకొచ్చింది రకుల్‌.

‘గత రెండేళ్లుగా ప్రయాణం బాగుంది. ప్రజలు నా నటన గురించి మాట్లాడుకోవడం సంతోషంగా అనిపిస్తోంది. ఇవన్నీ ఎవరికీ గుర్తుండవు.మున్ముందు ఏం చేయాలి? అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటా. విజయాల్ని, అపజయాల్ని పట్టించుకోను’ అని రకుల్‌ప్రీత్‌ చెప్పారు.