మంచివాళ్లతో పాటు చెడ్డవాళ్లూ ఉన్నారు !

అతి తక్కువ కాలంలో స్టార్ ఇమేజి సంపాయించిన మన అగ్ర కథానాయికల్లో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఒకరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చిన ఈ అమ్మడు.. అనతి కాలంలోనే సక్సెస్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న రకుల్‌.. త్వరలోనే నీరజ్‌పాండే దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతుంది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నటిగా ఈ స్థాయికి చేరుకునేందుకు తాను ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకొచ్చారు రకుల్‌ప్రీత్‌…..

“నటిగా గుర్తింపు వచ్చే పాత్రల్లోనే నటించాలని సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లోనే నిర్ణయించుకున్నా. వంద కోట్లు  సంపాదించే సినిమాతో నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన వాళ్లకి అలాంటి అవకాశాలు రావడం అంత సులువు కాదని నాకు తెలుసు. అందుకే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ… నేను అనుకున్న దిశగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చా. గత కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతున్నా. టాలీవుడ్‌లో స్టార్‌ నటులను.. కొత్త నటులను ఒకేవిధంగా చూస్తారు. ఇక్కడ టాలెంట్‌ను ఎంతో గౌరవిస్తారు. కాకపోతే ఇక్కడ కూడా మంచివాళ్లతో పాటు చెడ్డవాళ్లూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనల్ని మనం ఎలా పరిచయం చేసుకుంటున్నామనేది చాలా ముఖ్యం. అలాగే ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్లొ అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం” … అని చెప్పింది