మూడు పెద్ద చిత్రాల్లో అవకాశాలు చేజారాయి !

రకుల్‌ప్రీత్‌సింగ్‌ తన సినీ అనుభవాలను వ్యక్తం చేస్తూ… సినిమాల్లో తనకు ఏదీ సులభంగా లభించలేదంది. నటిగా తొలి అవకాశాన్ని, విజయాన్ని కష్టపడే పొందానని చెప్పింది. అయితే అదే సినిమా తనకు చాలా నేర్పించిందని పేర్కొంది. ప్రస్తుతం తమిళ చిత్రాల్లోనే అధికంగా నటిస్తున్నానని, హిందీ, కన్నడ భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయని అంది. తనకు ఖాళీగా కూర్చోవడం అసలు ఇష్టముండదని చెప్పింది. తనకు సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఉందని అంది. మొదట్లో జీవితం తలకిందులుగా మారిందని, అప్పుడే సవాళ్లను ధైర్యంగా ఎదురొడ్డి ఈ స్థాయికి ఎదిగానని చెప్పింది. ఇంకా చెప్పాలంటే …ఆ మధ్య 10 నెలల్లో మూడు పెద్ద చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయని, అయినా నిరాశతో కుంగిపోయి బాధ పడుతూ కూర్చోకుండా పట్టుదలతో శ్రమించి నటిగా రాణిస్తున్నానని పేర్కొంది. ఎవరైనా సవాళ్లను ఎదురొడ్డి పోరాడితేనే జీవితంలో విజయాలను సాధించగలరని రకుల్‌ప్రీత్‌సింగ్‌ అంది.

చరణ్‌ పక్కన ప్రత్యేకంగా మెరవబోతోంది !

బాలీవుడ్‌లో కత్రీనా కైఫ్‌, కరీనా కపూర్‌, ఐశ్వర్యరాయ్, తెలుగులో కాజల్‌, తమన్నా, అనుష్క ఛాన్స్‌ వచ్చినప్పుడల్లా ప్రత్యేక పాటలతో ప్రేక్షకులను అలరిస్తూ, సినిమా సక్సెస్‌లో కీలకమవుతున్నారు.స్టార్‌ హీరోయిన్లు ప్రత్యేక పాటల్లో మెరవడం ఇప్పుడు చాలా కామన్‌ అయిపోయింది. తాజాగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కూడా ఓ ప్రత్యేక పాటలో మెరవబోతున్నారు. రామ్‌చరణ్‌ నయా చిత్రంలో ఆయనకు జోడీగా స్టెప్పులేయనున్నారు. చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. డి.వి.వి దానయ్య నిర్మాత. కైరా అద్వానీ కథానాయిక.

ఇందులోని ప్రత్యేక పాట కోసం రకుల్‌ని ఎంపిక చేశారట. స్పెషల్‌ సాంగ్‌లో రకుల్‌ యాక్ట్‌ చేయటం ఇదే తొలిసారి. గతంలో చరణ్‌, రకుల్‌ ‘బ్రూస్‌లీ’, ‘ధృవ’ చిత్రాల్లో కలిసి నటించారు. మూడోసారి ఈ జోడీ ప్రత్యేక పాట ద్వారా మెస్మరైజ్‌ చేయడానికి రెడీ అవుతోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబేరాయ్ విలన్‌గా నటిస్తున్నారు. రకుల్‌ ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన ‘ఎన్‌జీకే’, కార్తీ తదుపరి చిత్రంలో, శివకార్తీకేయన్‌ నెక్ట్స్‌ చిత్రంలో, బాలీవుడ్‌లో అజయ్ దేవగన్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. అజయ్ దేవగన్‌ గురించి రకుల్‌ చెబుతూ… ‘అజయ్ తో  కలిసి నటించడం గొప్ప లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఆయన చాలా స్పాంటేనియస్‌ యాక్టర్‌. చిత్ర పరిశ్రమలో ఏదో సాధించాలనే లక్ష్యమంటూ నాకు లేదు. జస్ట్‌ ఈ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేస్తున్నా. నేను అనేకమంది ప్రతిభ కలిగిన వారితో పనిచేస్తున్నాను’ అని తెలిపారు.