తెలుగింటి కోడలయితే తప్పేంటి ?

ఏ ఆడపిల్లకయినా తనకు కాబోయే భర్త ఇలా ఉండలి…అన్న అభిప్రాయం ఉంటుంది. నాకూ అలాంటి అభిప్రాయాలే ఉన్నాయి…అని అంటోంది రాకుల్ ప్రీత్ సింగ్.  నేను మామూలుగా పొడుగు. అందుకే నాకాబోయే భర్త కూడా ఆరడుగులు ఎత్తు ఉండాలి. చాలా మంది అబ్బాయిలు మామూలు ఎత్తే ఉంటారు. ఒక పది శాతం మంది మాత్రమే నేను కోరుకునే హైట్‌ ఉంటారని అనుకుంటాను. వారిలోనే నాకాబోయే వ్యక్తిని ఎంచుకోవాలి. ఇది నా ప్రధాన డిమాండ్‌. అన్నిటికన్నా ముఖ్యమైనది మరొకటి ఉంది. అతను ఆటిట్యూడ్‌ అస్సలు చూపించకూడదు. అలా చూపిస్తే వెంటనే చెంప దెబ్బ కొట్టి వెళ్ళిపొమ్మంటాను….అని అంటోంది

మీ కోస్టార్స్ నుంచి ప్రపోజల్స్ వచ్చాయా? అని అడిగితే….
ఇంతవరకూ ఎవరూ ప్రపోజ్ చేయలేదు. అలాంటివి నేను ఊహించను కూడా లేదు అని చెప్పిన రకుల్…సినిమా రంగానికి చెందిన వ్యక్తిని పెళ్ళి చేసుకోరా? అని అడిగితే …..అది కూడా చెప్పలేను. ఇంత వరకూ నాకు పెళ్ళి ఆలోచన రాలేదు. ఒకవేళ తెలుగు ప్రాంతానికి చెందిన అబ్బాయిని చేసుకుని సమంత లాగా తెలుగింటి కోడలిని అవుతానేమో! తెలుగింటి కోడలయితే తప్పేంటి? భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడానికి నేనేమీ జ్యోతిష్కురాలిని కాదు కదా! ఆ సమయం వస్తే తెలుస్తుంది కదా! రకూల్‌ ఎవరిని చేసుకుంటుంది? ఏ ప్రాంతానికి కోడలిగా వెడుతుంది? అని ‘వెయిట్ అండ్ సీ!’….అని అంటోంది
 
లిమిటెడ్ గా చేద్దామనుకుంటున్నా!
 
ఉత్తరాది అమ్మాయినే అయినా దక్షిణాదిన ముఖ్యంగా టాలీవుడ్‌ నన్ను అక్కున చేర్చుకుంది. కోలీవుడ్‌ నుంచి అవకాశాలు వస్తున్నాయి. మంచి అవకాశం వస్తే అక్కడ సినిమా చేద్దామని ఎప్పటి నుంచో ఉంది. హీరో కార్తీతో నటించే చాన్స్‌ వచ్చింది. ఆ సినిమా అక్కడ మంచి విజయం సాధించడంతో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో కొంత కాలం గ్యాప్ తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. అంతే తప్ప తెలుగులో చేయకపోవడానికీ, తమిళంలో చేస్తున్న దానికీ మరో కారణం లేదు.
 
మొహమాటం కొద్దీ గతంలో కొన్ని సినిమాలు అంగీకరించాను. నా మీద ఒత్తిడి కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటోంది. దాంతో వయస్సు మీద పడినదానిలా కనిపించే అవకాశం ఉంది. ఇక నుంచి లిమిటెడ్ గా  సినిమాలు చేద్దామని అనుకుంటున్నాను. చేతిలో ఉన్న సినిమాలు అయిపోగానే సినిమాల సంఖ్య బాగా తగ్గించుకుంటాను…అని చెప్పింది