ఒకటి వదులుకున్నా, మరొకటి సొంతం చేసుకున్నా !

సినిమా జయాపజయాలు ప్రేక్షకుల అభిరుచిని బట్టి ఉంటాయి. ఏమాత్రం కథ లేకపోయినా, కథనం బాగుంటే ఆ సినిమా మంచి విజయం సాధించవచ్చు. మరోసారి అన్నీ కుదిరినా, ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. గతంలో కన్నా ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో బాగా మార్పు వచ్చింది. ‘సినిమా వెరైటీగా ఉంది’ అంటేనే చూస్తున్నారు. లేకపోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా, ఫ్లాప్‌ చేస్తున్నారు….అని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్ . ఇక నా సినిమాల విషయానికి వస్తే, గతంలో నా సినిమాల్లో కూడా కొన్ని ఫ్లాపులున్నాయి. కానీ సక్సెస్ రేటు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ రేటు తగ్గింది.  కొన్ని మూస పాత్రలు చేసిన మాట వాస్తవమే! అందుకే అవి విజయం సాధించి ఉండకపోవచ్చు. ఇక మీద అలాంటి పాత్రలు వస్తే చేయను.కొన్ని మొహమాటాలు కూడా తప్పులు జరగడానికి కారణాలు అవుతాయి. దక్షిణాదిన నా సినిమాలు కొన్ని పరాజయం కావడానికి ఇది ప్రధాన కారణం. ఇక మీదట అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను. సినిమాల ఎంపికలో మొహమాటాలు ఉండకూడదని బాగా అర్థమయింది.

దక్షిణాదిన అవకాశాలు తగ్గడం వల్లనే ….
పూర్తిగా అబద్ధం… దక్షిణాదిన బిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్‌లో‘అయ్యారీ’ సినిమా ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడ సినిమాలు పూర్తి కాగానే అక్కడి షూటింగ్‌లో పాల్గొన్నాను. బాలీవుడ్‌లో నా సినిమా షూటింగ్‌ మొదలయ్యేసరికి దక్షిణాదిన నేను పూర్తి చేసిన సినిమాలు కొన్ని విడుదల కూడా కాలేదు. వాటి ఫలితం తెలియకుండానే బాలీవుడ్‌లో సినిమా మొదలుపెట్టాను. అలాంటప్పుడు అవకాశాలు లేక బాలీవుడ్‌ వెళ్ళానని ఎలా అనగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కేవలం దక్షిణాది సినిమాలు మాత్రమే చేస్తే బాలీవుడ్‌లో అవకాశాలు రాక దక్షిణాదినే చేస్తోందని అంటారు. అలా కాకుండా బాలీవుడ్‌లో చేస్తే అవకాశాల్లేవని అనేస్తారు.
బాలీవుడ్‌లో నా మొదటి సినిమా అంత బాగా ఆడలేదు అన్న సంగతి తెలిసిందే! ఆ సినిమా వెంటనే రెండవ సినిమా ‘ఎంఎస్‌ ధోని’ మొదలు కావలసి ఉంది.అయితే అప్పటికే డేట్లను నేను దక్షిణాదికి ఇచ్చేయడం వల్ల  తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సినిమా వదులుకున్నాను. ఆ సినిమా మిస్‌ అయినందుకు చాలా బాధపడ్డాను.దక్షిణాదిన సినిమాలు వదులుకుని ఆ సినిమా చేసి ఉంటే దక్షిణాదిన  స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కేది కాదు. ఒకటి వదులుకున్నా, మరొకటి సొంతం చేసుకున్నాను.

 

బాలీవుడ్‌లో గ్లామర్‌ హద్దులు దాటేశారు ….

మితిమీరిన గ్లామరుకు నేనెప్పుడూ వ్యతిరేకినే! ఈ విషయంలో నా పరిధులు నాకు తెలుసు. నేను హద్దులు దాటానని ఎప్పుడూ అనుకోను.దక్షిణాదిన సినిమాలు చేయనని ఎవరికీ ఎప్పుడూ చెప్పలేదు. త్వరలోనే ఓ తెలుగు సినిమా చేసే అవకాశం ఉంది. కోలీవుడ్‌లో కూడా ఓ మంచి సినిమా చేయబోతున్నాను. ఇంతవరకూ నేను అలాంటి పాత్ర చేయలేదు. ఆ వివరాలు త్వరలోనే చెబుతాను. అజయ్‌ తీస్తున్న మరో  బాలీవుడ్ సినిమా చేస్తున్నాను