మార్చి 30న రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ `రంగ‌స్థ‌లం`

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై రూపొందుతున్న భారీ చిత్రం `రంగ‌స్థ‌లం`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌(సి.వి.ఎం) నిర్మాత‌లు ఈ ప్రెస్టీజియ‌స్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. మార్చి 30న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ – “శ్రీమంతుడు`, `జ‌న‌తా గ్యారేజ్‌` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల త‌ర్వాత మా బ్యాన‌ర్‌లో  రూపొందుతోన్న మోస్ట్ ఎగ్జ‌యిటింగ్ ప్రాజెక్ట్ `రంగ‌స్థ‌లం`. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌ఛ‌ర‌ణ్‌గారికి సంబంధించిన లుక్‌తో సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశాం. ఇప్ప‌టికే దీనికి సంబంధించి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. చిట్టిబాబు అనే పాత్ర‌లో రామ్‌చ‌రణ్ మాస్ యాక్టింగ్‌, స‌మంత గ్లామర్ ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. విల‌క్ష‌ణ‌మైన క‌థ‌లు, క్యారెక్ట‌రైజేష‌న్స్‌ను తెరపై సిద్ధ‌హ‌స్తుడైన ద‌ర్శ‌కుడు సుకుమార్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఆయ‌న డైరెక్ట్ చేసిన సినిమాలే ఆయ‌నేంటో చెబుతాయి. మ‌రోసారి త‌న‌దైన స్ట‌యిల్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను సుకుమార్‌గారు ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించారు. రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత ఇంతకు ముందెన్న‌డూ చేయ‌ని విభిన్న‌మైన‌ పాత్ర‌లు చేస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.  ఐదు రోజుల టాకీ, రెండు పాటలు మిన‌హా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ఈ నెల‌లో టాకీ పార్ట్‌ను పూర్తి చేస్తాం. జ‌న‌వ‌రిలో రెండు పాట‌లను షూట్ చేస్తాం. ఓ పాట‌లో పూజా హెగ్డే స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌నున్నారు. పాట‌ల చిత్రీక‌ర‌ణ‌తో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్త‌వుతుంది. దేవిశ్రీప్ర‌సాద్ అద్భుత‌మైన మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌పీ  సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మార్చి 30న వ‌రల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రం మా బ్యాన‌ర్ వాల్యూను పెంచడ‌మే కాకుండా మా సంస్థ‌కు హ్యాట్రిక్ హిట్‌ను అందించే చిత్ర‌మ‌వుతుంది“ అన్నారు.
రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత‌, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ఆది పినిశెట్టి, అన‌సూయ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ర‌త్న‌వేలు, ఎడిటింగ్‌: న‌వీన్ నూలి, సాహిత్యం: చ‌ంద్ర‌బోస్‌, ఫైట్స్‌:  రామ్‌ల‌క్ష్మ‌ణ్‌, నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌(సి.వి.ఎం), ద‌ర్శ‌క‌త్వం:  సుకుమార్‌.