తాజా షెడ్యూల్ పూర్తి చేసుకున్న రామ్

 రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మూడో షెడ్యూల్   జూన్ 14 వరకూ   హైద‌రాబాద్‌లో జరిగింది.  కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్‌. సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ‘నేను శైలజ’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్‌ కథానాయికలు.
నిర్మాత `స్ర‌వంతి` ర‌వికిశోర్ మాట్లాడుతూ “రామోజీ ఫిల్మ్ సిటీలో  తొలి షెడ్యూల్‌, వైజాగ్‌లో రెండో షెడ్యూల్ చేశాం.  మూడో షెడ్యూల్‌ను ఇటీవల  ఐదు రోజుల పాటు హైద‌రాబాద్‌లో తెర‌కెక్కించాం. జూన్ 10, 11న కెజీ రెడ్డి కాలేజీలోనూ, 12న సంజీవ‌య్య పార్కులోనూ, 13న రామోజీ ఫిల్మ్ సిటీలోనూ, 14న రాత్రి అంబేద్క‌ర్ యూనివ‌ర్శిటీలోనూ షూటింగ్ చేశాం. ఈ నెలాఖ‌రు నుంచి వైజాగ్‌, అర‌కులో మ‌రో షెడ్యూల్ ఉంటుంది“ అని చెప్పారు.
ద‌ర్శ‌కుడు కిశోర్‌ తిరుమల మాట్లాడుతూ “రామ్ హీరోగా నా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `నేను శైల‌జ‌` సూపర్ హిట్ కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో తాజా సినిమా ప‌ట్ల అంచ‌నాలు పెరిగాయి. వాటిని చేరుకునేలా మేం క‌థ‌ను సిద్ధం చేశాం. ఈ క‌థ త‌ప్ప‌కుండా ఫ్రెష్ ఫీల్‌ని క‌లిగిస్తుంది. రామ్ లుక్‌కు ఇప్ప‌టికే చాలా మంచి స్పందన వ‌స్తోంది. నాయిక‌లు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మేఘా ఆకాశ్‌.. ఇద్ద‌రూ  సినిమాకు ప్ల‌స్ అవుతారు. వారి పాత్ర‌లు కూడా కీల‌క‌మైన‌వే. దేవిశ్రీప్ర‌సాద్ మంచి బాణీల‌ను అందించారు. ఇప్ప‌టివ‌ర‌కు తెర‌కెక్కించిన స‌న్నివేశాలు సంతృప్తిక‌రంగా వ‌చ్చాయి“ అని అన్నారు.
 

శ్రీవిష్ణు, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాశ్, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సాహిత్యం: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

అరుదైన రికార్డ్..
రామ్ హీరోగా గ‌తేడాది విడుద‌లైన `నేను శైల‌జ‌` సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ  తెలిసిందే. ఆ సినిమా విడుద‌ల‌కు ముందే ఆ చిత్రంలోని పాట‌లు శ్రోత‌ల్లో విప‌రీత‌మైన క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. ఇప్పుడు ఆ క్రేజ్ మ‌రింత పెరిగింది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం వ‌హించిన `క్రేజీ క్రేజీ ఫీలింగ్‌` అనే పాట‌ను ఇప్ప‌టికే యూట్యూబ్‌లో మూడు కోట్ల మంది వీక్షించారు. తెలుగు సినిమా పాట‌ల్లో ఇది అరుదైన రికార్డుగా అభివ‌ర్ణించ‌వ‌చ్చు. `నేను శైల‌జ‌` చిత్రాన్ని స్ర‌వంతి మూవీస్ ప‌తాకంపై `స్ర‌వంతి` ర‌వికిశోర్ నిర్మించారు. కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టించారు.

4 Attachments