సంక్రాంతి కి రామ్ స‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌‌ ‘రెడ్’

‘ఎనర్జిటిక్‌ స్టార్’ రామ్‌ హీరోగా’ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత  చేసిన సినిమా ‘రెడ్’ . కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్‌  నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కి విడుదల . కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ‘‘రామ్‌గారితో  స్రవంతి మూవీస్‌లో  నేను చేసిన మూడో సినిమా ఇది .‘రెడ్‌’ సినిమా కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెబుతున్నా. కథ కొత్తగా ఉంటుంది. ట్రీట్‌మెంట్‌ కూడా కొత్తగా ఉంటుంది. ఇది థ్రిల్లర్‌ అయినప్పటికీ కమర్షియల్‌గా ఉంటుంది’’ అని అన్నారు.
రామ్‌ మాట్లాడుతూ ‘‘ నా 18వ సినిమా ‘రెడ్‌’. కిషోర్ దర్శకత్వంలో నాకిది మూడో సినిమా .ఫస్ట్‌ టైమ్‌ కెరీర్‌లో ఒక థ్రిల్లర్‌ చేశాను .మాస్‌ ఎలిమెంట్స్‌, క్లాస్‌ఎలిమెంట్స్‌ అన్నీ ఉంటాయి’’ అని చెప్పారు .
‘స్రవంతి’ రవికిషోర్ మాట్లాడుతూ.. ‘‘ ‘స్రవంతి’ మూవీస్‌లో రామ్‌తో ఇదీ మరో మంచి సినిమా అవుతుంది. మణి శర్మ తొలిసారిగా మా సంస్థ లో పని చేశారు .ఇదో స‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ కం ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్.ఆద్యంతం ఎమోష‌న్స్ ర‌క్తి క‌ట్టిస్తాయి. కేవ‌లం క్రైమ్ ఎలిమెంట్ మాత్ర‌మే కాదు.. ఇందులో చ‌క్క‌ని ల‌వ్ స్టోరి ఉంది. మ‌ద‌ర్ సెంటిమెంట్.. ఎంట‌ర్ టైన్ మెంట్ హైలైట్ గా నిలుస్తాయి’’ అని అన్నారు.
రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ , నాజ‌ర్ తదితరులు నటించిన  ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: పీటర్‌ హెయిన్స్