రామ్ చరణ్ “రంగస్థలం” కు మంచి రేటు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా “రంగస్థలం 1985”. రామ్ చరణ్ “ధృవ” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చరణ్ కెరీర్ లోనే బిగెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 51 కోట్ల వరకు బిజినెస్ పూర్తి చేసుకుంది.శాటిలైట్ హక్కులకు గాను 16 కోట్లు, ఇతర డిజిటల్ హక్కులు 13 కోట్లతో పాటు.. పలు ఏరియాలకు సంబంధించిన బిజినెస్ కూడా పూర్తయ్యిందన్న ప్రచారం జరుగుతుంది. సినిమా రిలీజ్ అయ్యే లోపు “రంగస్థలం 1985” ప్రీ రిలీజ్ బిజినెస్ 125 కోట్ల వరకు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. “ధృవ” సినిమా 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చరణ్, “రంగస్థలం”తో 100 కోట్ల క్లబ్ లో ఎంటర్ అవ్వటం ఖాయంగా కనిపిస్తుంది.