మార్షల్‌ ఆర్ట్స్‌ తో వర్మ ‘ఎంటర్‌ ద గర్ల్‌ డ్రాగన్‌’

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’, ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ వంటి సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న వర్మ తాజాగా మరో సినిమా అందిస్తున్నారు. ‘ఎంటర్‌ ద గర్ల్‌ డ్రాగన్‌’ సినిమాను తెరపైకి తెచ్చాడు. ఇది భారతదేశంలో నిర్మించిన తొలి మార్షల్‌ ఆర్ట్స్‌ చిత్రం… తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన ఈ సినిమా టీజర్‌ను బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 3.12 గంటలకు విడుదల చేస్తున్నట్టు వర్మ వెల్లడించారు.బ్రూస్‌ లీ పట్ల తన ప్రేమను, ఆరాధనను చాటుతూ రాంగోపాల్‌ వర్మ ఫేస్‌బుక్‌లో ఒక నోట్‌ పోస్టు చేశారు.
ఇండో-చైనా సంయుక్త ప్రొడక్షన్‌లో ఈ సినిమా నిర్మితమవుతుందని … చైనీస్‌ నిర్మాతతో ఒప్పందంపై సంతకం చేస్తున్న ఫొటోను కూడా ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ సినిమా అంతర్జాతీయ ట్రైలర్‌ను బ్రూస్‌ లీ సొంత పట్టణమైన చైనాలోని ఫోషన్‌ సిటీలో డిసెంబర్‌ 13న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
మార్షల్‌ ఆర్ట్స్‌ అభిమానులు మెచ్చేలా..
రాంగోపాల్‌ వర్మ తాజా చిత్రం ‘ఎంటర్‌ ద గర్ల్‌ డ్రాగన్‌’ టీజర్‌ విడుదలైంది. బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ఈ సినిమాను టీజర్‌ను వర్మ విడుదల చేశారు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా భలేకర్‌ ప్రధాన పాత్రలో నటించారు. మార్షల్‌ ఆర్ట్స్‌అభిమానులు.. వర్మ అభిమానులు మెచ్చేలా ఈ టీజర్‌ ఉంది. పూజా భలేకర్‌ తన పాత్రకు న్యాయం చేసేందుకు కష్టపడినట్లు కనిపిస్తోంది.
ఇండో-చైనా సంయుక్త నిర్మాణంలో జింగ్‌ లియు, టి.నరేశ్‌, టి.శ్రీధర్‌ ఈ సినిమాను నిర్మించారు. రవి శంకర్‌ సంగీతం అందించారు.