ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘మామ ఓ చందమామ’

యంగ్‌ హీరో రామ్‌ కార్తీక్‌ హీరోగా సనా మక్బూల్‌ ఖాన్‌ హీరోయిన్‌గా ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విశాఖ థ్రిల్లర్స్‌ వెంకట్‌ దర్శకత్వంలో వరప్రసాద్‌ బొడ్డు నిర్మించిన ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మామ ఓ చందమామ’. మున్నా కాశీ సంగీతం సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోకి, ట్రైలర్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్‌ యు సర్టిఫికెట్‌తో డిసెంబర్‌ 15న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో రామ్‌ కార్తీక్‌, హీరోయిన్‌ సనా మక్బూల్‌ ఖాన్‌ పాల్గొన్నారు.
ఇట్స్‌ ఎ విజువల్‌ ట్రీట్‌ ఫిల్మ్‌ !
హీరో రామ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ – ”ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్‌టైనర్స్‌ బేనర్‌లో తొలి ప్రయత్నంగా ‘మామ ఓ చందమామ’ చిత్రాన్ని ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మా నిర్మాతలు వరప్రసాద్‌, మురళి సాధనాల నిర్మించారు. బేసిగ్గా వారు యు.ఎస్‌.లో సెటిల్‌ అయ్యారు. మన కల్చర్‌, మన ట్రెడిషన్‌, మన రిలేషన్స్‌ గురించి ప్రతి ఒక్కరికీ తెలియజెప్పాలని ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. దర్శకుడు విశాఖ ధ్రిల్లర్స్‌ వెంకట్‌ బేసిగ్గా నృత్య దర్శకుడైనా సినిమాని ఎంతో ప్రేమించి అద్భుతమైన సినిమాని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో చంటి క్యారెక్టర్‌లో నటించాను. విలేజ్‌లో ప్రతి ఒక్కరికీ చేదోడు వాదోడుగా వుంటూ అందర్నీ ప్రేమించి.. అందరి ప్రేమ పొందుతూ చాలా సరదాగా వుండే కుర్రాడి క్యారెక్టర్‌లో నటించాను. ఫస్ట్‌టైమ్‌ ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో నటించాను. కామెడీ, లవ్‌, ఎమోషన్స్‌ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. అందరికీ నచ్చే ఒక మంచి సినిమా చేసాం. సుమన్‌, జీవా, గీతాంజలి, సుధ వంటి సీనియర్‌ యాక్టర్స్‌తో కలిసి వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. మున్నా కాశీ అందించిన మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఎల్‌.బాబుగారి కెమెరా విజువల్స్‌ ఫెంటాస్టిక్‌గా వుంటాయి. ఇట్స్‌ ఎ విజువల్‌ ట్రీట్‌ ఫిల్మ్‌. రామ్‌ సుంకర కంపోజ్‌ చేసిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌, మాధవ్‌ కోకా ఎడిటింగ్‌ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌గా నిలుస్తాయి. అలాగే గణేష్‌, సతీష్‌ మాస్టర్స్‌ బ్యూటిఫుల్‌ కొరియోగ్రఫీ కంపోజ్‌ చేశారు. టీమ్‌ అంతా కలిసి ఒక ఆహ్లాదకరమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాం. ‘ఇట్స్‌ మై లైఫ్‌, దృశ్యకావ్యం, ఇద్దరి మధ్య’ చిత్రాల తర్వాత నేను చేస్తోన్న చిత్రం ఇది. ఈ డిసెంబర్‌ 15న 15 చిత్రాలు రిలీజ్‌ అవుతున్నాయి. అన్ని చిత్రాలు ఆడాలి. అందులో మా చిత్రాన్ని కూడా ఆదరించాలి” అన్నారు.
ఎంతో ఎంజాయ్‌ చేస్తూ ఇష్టపడి చేసా ! 
హీరోయిన్‌ సనా మక్బూల్‌ ఖాన్‌ మాట్లాడుతూ – ”ఇది నా థర్డ్‌ మూవీ. లాస్ట్‌ టైమ్‌ ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంలో నటించాను. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఇది. ఇందులో కార్తీ పాత్రలో నటించాను. అల్లరి చిల్లరగా తిరుగుతూ రఫ్‌గా వుండే స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి క్యారెక్టర్‌లో నటించాను. లంగా, ఓణి, చూడీదార్‌లో కనిపిస్తాను. నేను ఎంతో ఎంజాయ్‌ చేస్తూ ఇష్టపడి చేసిన సినిమా ఇది. రొమాన్స్‌, లవ్‌, కామెడీ, యాక్షన్‌ అంశాలు అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. యూత్‌, ఫ్యామిలీ అందరూ చూసి ఎంజాయ్‌ చేసేవిధంగా ఈ చిత్రం వుంటుంది. జబర్దస్త్‌ అప్పారావు, గెటప్‌ శ్రీనుల కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. విశాఖ థ్రిల్లర్స్‌ వెంకట్‌ మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌. ఈ చిత్రం అతనికి డైరెక్టర్‌గా మంచి పేరు తెస్తుంది. రాజమండ్రి, వైజాగ్‌, అమలాపురం, చుట్టు పక్కల పరిసర ప్రాంతాల్లో చక్కని పంట పొలాల మధ్య చిత్ర షూటింగ్‌ జరిగింది. ఈ సినిమా చేశాక నాకు రాజమండ్రి అంటే ఎంతో ఇష్టం పెరిగింది. డిసెంబర్‌ 15న రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి పెద్ద సక్సెస్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను” అన్నారు.