`గ్రీన్ కార్డ్` ప్రీ రిలీజ్ వేడుక‌

మాస్ట‌ర్ దేవాన్ష్ స‌మ‌ర్ప‌ణ‌లో సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ‌తృఘ్న రాయ‌పాటి(యు.ఎస్‌.ఎ),స్టెఫానీ(యు.ఎస్‌.ఎ), జోసెలిన్‌(యు.ఎస్‌.ఎ) తారాగ‌ణంగా ర‌మ్స్ (యు.ఎస్‌.ఎ) ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస్ గుప్తా(యు.ఎస్‌.ఎ), మోహ‌న్‌.ఆర్‌(యు.ఎస్‌.ఎ), న‌ర‌సింహ‌, నాగ‌శ్రీనివాస‌రెడ్డి నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం `గ్రీన్‌కార్డ్‌`. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని ఆగ‌స్టు 4న సినిమా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సోమ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ లో జ‌రిగింది. అలాగే ఇదే వేదిక‌పై NRI MAA MOVIE ARTIST`S ASSOCIATION లోగో,  మ‌రియు www.nrimaa.com ను ప్రారంభించారు.

అనంత‌రం చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మ్స్ మాట్లాడుతూ…. `అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ల‌కు సినిమాలు చేయాల‌ని ఉంటుంది. కానీ స‌రైన వేదిక‌…అవ‌కాశాలు ఎలా వ‌స్తాయ‌న్న దానిపై అవ‌గాహ‌న‌లేదు. దీంతో చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు. అలాంటి వాళ్ల‌కు  స‌మాచారం అందించ‌డం కోసం ఈ వెబ్ సైట్ ను ప్రారంభించాం. సినిమాల‌పై ఫ్యాష‌న్ ఉన్న ఎన్ ఆర్ ఐలంద‌రికీ ఈ సైట్ ఉయ‌యుక్తంగా ఉంటుంది. న‌టీన‌టుల కోసం ద‌ర్శ‌క, నిర్మాత‌లు  వెదుక్కునే ప‌నిలేకుండా ఈ సైట్ స‌మాచారం అందిస్తుంది. ఇప్ప‌టికే ఎన్ఆర్ మూవీ ఆర్టిస్ట్  అసోసియేష‌న్ లో 300మంది జాయిన్ అయ్యారు. ఆస‌క్తిగ‌ల వారు ఎవ‌రైనా సైట్ లో వివ‌రాలు తెలుసుకుని మ‌మ్న‌ల్ని సంప్రదించ‌వ‌చ్చు. అలాగే ఎన్ఆర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ద్వారా అవ‌కాశాలు ఇప్పించ‌డానికి ప్ర‌య‌త్నిస్తాం.` అని అన్నారు.  సినిమా గురించి మాట్లాడుతూ,  “90 శాతం సినిమాను అమెరికాలోనే చిత్రీక‌రించాను. అమెరికా లో లైఫ్ ఎలా ఉంటుంది?  వైఫ్ ఎలా ఉంటుంది? అమెరికాలో ఉన్న వారికి కూడా తెలియ‌ని చాలా విష‌యాల‌ను ఇందులో చూపించ‌బోతున్నాం. క‌థ అంతా స‌ర‌ద‌గా సాగిపోతుంది`  అన్నారు.

న‌టుడు చ‌ల‌ప‌తిరావు మాట్లాడుతూ…` ఇక్క‌డ నుండి అమెరికాకు వెళ్ళే వారు గ్రీన్‌కార్డ్ కోసం ఎన్ని తిప్పులు ప‌డ‌తార‌నే కాన్సెప్ట్‌తో ర‌మ్స్ చ‌క్క‌గా తెర‌కెక్కించాడు.  తెలుగు ఆడియ‌న్స్ కు కొత్త ఫీల్ ను ఇచ్చే సినిమా ఇది.  అమెరికాలో ప‌డే బాధ‌లు..వ్య‌ధ‌ల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. ముఖ్యంగా అమెరికాలో  గ‌న్ క‌ల్చ‌ర్ గురించి బాగా చూపించారు.  అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు చూడ‌దగ్గ సినిమా ఇది.  సినిమా పెద్ద విజ‌యంసాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది` అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ న‌ర‌సింహ మాట్లాడుతూ….` నిర్మాత‌లంతా అమెరికాలో ఉండ‌టం వ‌ల్ల ఆ బాధ్య‌త‌ల్నింటినీ నాపైనే పెట్టారు. సినిమా బాగా వ‌చ్చింది. ఇందులో ఓ మంచి పాత్ర పోషించా. అలాగే చ‌ల‌ప‌తిరావు గారు క్యారెక్ట‌ర్ హైలైట్ గా ఉంటుంది. ఈ సినిమా కోసం ఆయ‌న చాలా స‌హ‌క‌రించారు` అని అన్నారు.

ఎమ్ జీ ఎమ్ సంస్థ పంపిణీ  దారుడు బాబు మాట్లాడుతూ….` గ్రీన్ కార్డ్ చిత్రాన్ని మా సంస్థ ద్వారా రిలీజ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగామొత్తం 80 థియేట‌ర్ల‌ల‌లో సినిమా విడుద‌ల చేస్తున్నాం` అని అన్నారు.

ఎన్ఆర్ ఐ దంప‌తులు మ్యాథ్యూస్, ఎంజెలినా మాట్లాడుతూ….` వేలాది మంది అనాధ పిల్ల‌ల‌ను చేర‌దీసి వాళ్ల‌కు చ‌దువులు చెప్పించాం. వాళ్లంతా ఇప్పుడు ఉన్న‌త స్థానాల్లో కొన‌సాగుతున్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి మ‌రింత మంది ముందుకు రావాల‌ని కోరుకుంటున్నాం. అలాగే గ్రీన్ కార్డ్ సినిమా బాగా వ‌చ్చింది. అమెరికాలో ఇండియ‌న్స్ ఎలాంటి ఇబ్బందులు ప‌డుతున్నార‌న్న‌ అశాన్ని ర‌మ్స్ చ‌క్కగా చూపించారు` అని అన్నారు.

శ‌తృఘ్న రాయ‌పాటి(యు.ఎస్‌.ఎ),స్టెఫానీ(యు.ఎస్‌.ఎ), జోసెలిన్‌(యు.ఎస్‌.ఎ), రెబెకా(యు.ఎస్‌.ఎ), మిల్లి(యు.ఎస్‌.ఎ), స్వీటెన్ (యు.ఎస్‌.ఎ) త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః కు(యు.ఎస్‌.ఎ), హెన్నీ ప్రిన్స్‌, ప్ర‌ణ‌య్‌కుమార్‌, కెమెరాః న‌వీన్‌(యు.ఎస్‌.ఎ), నాగ‌శ్రీనివాస్‌రెడ్డి, ఎడిటింగ్ః మోహ‌న్‌, రామారావు, నిర్మాత‌లుః శ్రీనివాస్ గుప్తా(యు.ఎస్‌.ఎ), మోహ‌న్‌.ఆర్‌(యు.ఎస్‌.ఎ), న‌ర‌సింహ‌, నాగ‌శ్రీనివాస‌రెడ్డి, ద‌ర్శ‌క‌త్వంః ర‌మ్స్ (యు.ఎస్‌.ఎ).