ఆగ‌స్టు 4న ప్రేక్ష‌కుల ముందుకు `గ్రీన్ కార్డ్`

మాస్ట‌ర్ దేవాన్ష్ స‌మ‌ర్ప‌ణ‌లో సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ‌తృఘ్న రాయ‌పాటి(యు.ఎస్‌.ఎ),స్టెఫానీ(యు.ఎస్‌.ఎ), జోసెలిన్‌(యు.ఎస్‌.ఎ) తారాగ‌ణంగా ర‌మ్స్ (యు.ఎస్‌.ఎ) ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస్ గుప్తా(యు.ఎస్‌.ఎ), మోహ‌న్‌.ఆర్‌(యు.ఎస్‌.ఎ), న‌ర‌సింహ‌, నాగ‌శ్రీనివాస‌రెడ్డి నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం `గ్రీన్‌కార్డ్‌`. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని ఆగ‌స్టు 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ….

సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు మాట్లాడుతూ  “ ఈ గ్రీన్ కార్డ్ సినిమా తొంబై శాతం అమెరికాలోనే చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంది. ఇక్క‌డ నుండి అమెరికాకు వెళ్ళే వారు గ్రీన్‌కార్డ్ కోసం ఎన్ని తిప్పులు ప‌డ‌తార‌నే కాన్సెప్ట్‌తో ర‌మ్స్ చ‌క్క‌గా తెర‌కెక్కించాడు.  తెలుగు ఆడియ‌న్స్ కు కొత్త ఫీల్ ను ఇచ్చే సినిమా ఇది.  అమెరికాలో ప‌డే బాధ‌లు..వ్య‌ధ‌ల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. అలాగే యూత్ ను ఆక‌ట్టుకునే అంశాలు హైలైట్ గా ఉంటాయి.  సినిమా పెద్ద విజ‌యంసాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ర‌మ్స్ మాట్లాడుతూ  “90 శాతం సినిమాను అమెరికాలోనే చిత్రీక‌రించాను. అమెరికా లో లైఫ్ ఎలా ఉంటుంది?  వైఫ్ ఎలా ఉంటుంది? అమెరికాలో ఉన్న వారికి కూడా తెలియ‌ని చాలా విష‌యాల‌ను ఇందులో చూపించ‌బోతున్నాం. క‌థ అంతా స‌ర‌ద‌గా సాగిపోతుంది`  అన్నారు.

అలాగే అమెరికా నుంచి ఇండియాకు వ‌చ్చిన ఎన్ ఆర్. ఐల  ప‌రిస్థితులు గురించి ర‌మ్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా నుంచి ఇండియా వ‌చ్చిన ఎన్ ఆర్ ఐ లు అంటే బాగా సంపాదించి వ‌చ్చార‌నే భావ‌న ఇక్క‌డ ఉంది. అక్క‌డ నానా పాట్లు ప‌డ‌తామ‌న్న‌ది చాలా త‌క్కువ మందికే తెలుసు. అక్క‌డ నేను పిజ్జాలు కూడా అమ్మాను. ఇలాంటి వి అక్క‌డ ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు కాబ‌ట్టి చేయ‌గ‌లిగాం. కానీ అక్క‌డ ప‌డ్డ క‌ష్టాలు క‌న్నా ఇక్క‌డ  ప‌డుతున్న‌ సమ‌స్య‌లు ఎక్కువైపోతున్నాయి. ఈ విష‌యాల‌ను ముఖ్య‌మంత్రులు గ‌మ‌నించాల్సింది గా కోరుతున్నాం. అలాగే  ఇక్క‌డ ఎన్ ఆర్ ఐల‌కు  ఓటు హ‌క్కును క‌ల్పింస్తార‌ని ఆశిస్తున్నాం` అని అన్నారు.  అలాగే ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్ జీ ఎమ్ సంస్థ పంపిణీ  దారుడు బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

శ‌తృఘ్న రాయ‌పాటి(యు.ఎస్‌.ఎ),స్టెఫానీ(యు.ఎస్‌.ఎ), జోసెలిన్‌(యు.ఎస్‌.ఎ), రెబెకా(యు.ఎస్‌.ఎ), మిల్లి(యు.ఎస్‌.ఎ), స్వీటెన్ (యు.ఎస్‌.ఎ) త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః కు(యు.ఎస్‌.ఎ), హెన్నీ ప్రిన్స్‌, ప్ర‌ణ‌య్‌కుమార్‌, కెమెరాః న‌వీన్‌(యు.ఎస్‌.ఎ), నాగ‌శ్రీనివాస్‌రెడ్డి, ఎడిటింగ్ః మోహ‌న్‌, రామారావు, నిర్మాత‌లుః శ్రీనివాస్ గుప్తా(యు.ఎస్‌.ఎ), మోహ‌న్‌.ఆర్‌(యు.ఎస్‌.ఎ), న‌ర‌సింహ‌, నాగ‌శ్రీనివాస‌రెడ్డి, ద‌ర్శ‌క‌త్వంః ర‌మ్స్ (యు.ఎస్‌.ఎ).