అతని అండతోనే ఈ జంట ఒక్కటయ్యింది !

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణ, విజయ నిర్మల నుంచి మొదలుకొని ఎన్నో సక్సెస్ ఫుల్ ప్రేమకథలు ఉన్నాయి. నాగార్జున, అమల సహా ఎంతోమంది తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చారు. ఈ తరంలో సమంత, నాగ చైతన్య ప్రేమకథకు కూడా  ఉంది. ఈ ఇద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే సమంత, చైతూ ప్రేమకథలో సినిమాను మించిన ట్విస్టులు ఉన్నాయి. ‘మేంప్రేమించుకున్నాం’ అని వారు చెప్పగానే కుటుంబ సభ్యులు తేలిగ్గా ఒప్పుకోలేదు. దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది కూడా. ఎందుకంటే నాగ చైతన్యను పెళ్లాడాలంటే.. రెండు కుటుంబాలను ఒప్పించాలి. అక్కినేని కుటుంబంతోపాటు దగ్గుబాటి కుటుంబాన్ని కూడా ఒప్పిస్తే కానీ అక్కినేని కోడలు కాలేదు. సమంత అన్నంత పనిచేసి అందర్నీ ఒప్పించి తన ప్రేమను గెలిపించుకుంది. అయితే సమంత ప్రేమ గెలవడానికి ఒకరి హస్తం మాత్రం బలంగా ఉంది. అది  రానా దగ్గుబాటి.

చైతూకు చిన్నప్పటి నుంచి మంచి దోస్త్ రానా. ఇద్దరూ బావా బామ్మర్దులు అయినా కూడా క్లోజ్ ఫ్రెండ్స్ లానే ఉంటారు. ప్రతీ విషయంలో చైతూకు వెన్నంటే ఉంటాడు రానా. చివరికి పెళ్లి విషయంలో కూడా రానానే అండగా ఉన్నాడు. సమంత, చైతూ ప్రేమించుకున్న విషయం ఇంట్లో చెప్పి ఒప్పించడంలో రానా చాలా కీలక పాత్ర పోషించాడు. ఇదే విషయం సమంత కూడా చెప్పింది. ఈ మధ్యే ఓ షోలో రానాకు సభాముఖంగా అందరి ముందు థ్యాంక్స్ చెప్పింది. “నేను అక్కినేని కుటుంబంలోకి వచ్చానంటే కారణం నువ్వే రానా” అంటూ థ్యాంక్స్ చెప్పుకుంది.

వారం రోజుల పాటు వేరే లోకంలో…  వారం రోజుల వెకేషన్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చారు నాగచైతన్య సమంత . లాక్ డౌన్ తర్వాత షూటింగ్స్ మొదలు కావడంతో బిజీ బిజీగా మారిపోయిన ఈ ఇద్దరు కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని నవంబర్ 23న నాగచైతన్య బర్త్ డే సందర్భంగా మాల్దీవ్స్ వెళ్లారు . అక్కడే ఇన్ని రోజులు ఉన్నారు. భర్త బర్త్ డే వేడుకలు కూడా అక్కడ ఘనంగా చేసింది సమంత అక్కినేని. వీటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిట్టి పొట్టి డ్రెస్సులతో సమంత ఇచ్చిన హాట్ హాట్ ఫోజులు చాలా ట్రెండింగ్ అయ్యాయి. సినిమాలు, షూటింగులు అనే విషయాలు పూర్తిగా మర్చిపోయి వారం రోజుల పాటు వేరే లోకంలో గడిపారు  ఈ జంట.

హైదరాబాద్ వచ్చి రాగానే ఎవరి పనుల్లో వారు బిజీ కానున్నారు. నాగచైతన్య చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో మొదటిది శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’. ఈ సినిమాను పూర్తి చేసి మిగిలిన సినిమాలపై ఫోకస్  చేయనున్నాడు నాగ చైతన్య. మరోవైపు సమంత సినిమాలు చేయకపోయినా డిజిటల్ మీడియాలో బిజీ అయిపోయింది. ‘ఆహా’ ప్లాట్ ఫామ్ లో ‘స్యామ్ జామ్’ అనే టాక్ షో చేస్తుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. త్వరలోనే చిరంజీవితో సహా ఇంకా చాలామంది సెలబ్రిటీలు టాక్ షోకి రానున్నారు. వాటితో బిజీ కానుంది అక్కినేని కోడలు. ఇవి మాత్రమే కాదు వెబ్ సిరీస్ లో కూడా నటించడానికి సమంత ఓకే చెబుతోంది .