రానా బుల్లితెర షో షూటింగ్ స్టార్ట్

‘ఘాజి’, ‘బాహుబ‌లి’ సినిమాలతో దేశ వ్యాప్తం గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా ఇప్పుడు బుల్లి తెర‌పైన సంద‌డి చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు. కేవలం సెలబ్రిటీలు మాత్రమే పాల్గొనే ‘కాఫీ విత్ కరణ్’ తరహాలో ‘నెం వన్ యారి’ టీవీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రానా. ఆసక్తికరమైన విశేషాలతో ఈ కార్యక్రమం కొనసాగుతుందని అంటున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది.

రానాకి వ‌ర‌స‌కు అంకుల్ మరియు బావ అయిన సుమంత్, నాగ చైత‌న్య షూట్ లో పాల్గొన్నార‌ట‌. స‌ర‌దాగా వీరి మ‌ధ్య సాగిన సంభాష‌ణ‌లు బుల్లితెర ఆడియ‌న్స్ కి మంచి కిక్ ఇస్తాయ‌ని అంటున్నారు. ఇక మ‌రో ఎపిసోడ్ లో రానా కి మంచి స్నేహితులైన అఖిల్ , రాజమౌళి త‌న‌యుడు  కార్తికేయ లను ఆహ్వానించాడు. వారి షూటింగ్ కూడా పూర్తైన‌ట్టు తెలుస్తోంది. ఒక ప్రముఖ ఛానల్ లో ప్ర‌సారం కానున్న ఈ షోకి సంబంధించిన టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లై ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపింది