ఒంటరి పక్షులు ఇప్పుడు ఒకటయ్యాయి !

రణ్‌బీర్ కపూర్ మళ్లీ ప్రేమలో పడ్డాడట. ప్రపోజ్ చెయ్యడానికి ఎంత టైం తీసుకుంటాడో, అంతకంటే తక్కువ టైంలోనే బ్రేకప్ చెబుతాడనే పేరున్న రణ్‌బీర్ కొత్త ప్రేమ కథని మొదలుపెట్టాడని చెబుతున్నారు. అమాయకపు చూపులతో కుర్రాళ్ళను మాయ చేసే అలియాభట్‌తో రిలేషన్‌లో ఉన్నాడని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కలసి నటిస్తోన్న వీళ్ళిద్దరు ఆఫ్ స్క్రీన్ లోనూ అదే కెమిస్ట్రీ కంటిన్యూ చేస్తున్నారట. రణ్‌బీర్ ఇంతకుముందు దీపికా పదుకొణే, కత్రినాకైఫ్‌తో వ్యవహారం నడిపి బ్రేకప్ చెప్పాడు. ఇక అలియా కూడా సిద్ధార్థ్ మల్హోత్రాతో విడిపోయింది. ప్రేమ బంధం నుంచి బయటపడిన ఈ ఒంటరి పక్షులు ఇప్పుడు ఒక్కటయ్యారని బొంబాయి జనాల్లో చర్చలు నడుస్తున్నాయి.
రణ్‌బీర్ కపూర్, అలియాభట్ మధ్య ఏదో నడుస్తుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తోన్నా… ఇరు కుటుంబాలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పెరుగుతోన్న చనువుతో ఇరు కుటుంబాలు ఆలోచనలో పడ్డాయట. రీసెంట్‌గా రణ్‌బీర్- అలియా ‘బ్రహ్మాస్త్ర’ దర్శకనిర్మాతలు కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీతో కలసి డిన్నర్‌కు వెళ్ళారు. ఈ పార్టీకి విడివిడిగా వెళ్ళిన రణ్‌బీర్, అలియా ఆ విందు ముగిశాక ఒకే కారులో ఇంటికి వెళ్ళారట. దీంతో ఈ జంట మధ్య అనుబంధం ముదిరిందనే వార్తలు ఎక్కువయ్యాయి.
రణ్‌బీర్ కపూర్ ప్రేమలో ఎంత కేరింగ్‌గా ఉంటాడో, అంతే మిస్టీరియస్‌గా ఉంటాడని అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ కంప్లైంట్ చేస్తుంటారు. అతను ఎప్పుడు ఎలా మారుతాడో చెప్పడం కూడా కష్టమే అంటారు. అలాంటిది ఈ బ్రేకప్ స్టార్ అలియాభట్‌తో ప్రేమలో పడ్డాడు …అనగానే బాలీవుడ్ జనాల్లో చాలా సందేహాలు మొదలయ్యాయి. రిలేషన్‌ను సరిగా కంటిన్యూ చెయ్యలేని ఈ హీరో అలియాతో అయినా… ?  మరి వీళ్ళ అనుబంధం ఏ తీరానికి చేరుతుందనేది కాలమే చెప్పాలి…