‘నాకు నైట్ లైఫ్ అన్నా.. పార్టీలన్నా మహా ఇష్టం !’

యంగ్ హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్‌గా కనిపిస్తూ, అల్లరి  చేస్తూ ప్రేక్షకులను అలరిస్తారు. కానీ కొంతమంది భామలు నిజ జీవితంలో కూడా అదే రేంజ్‌లో ఎంజాయ్‌చేస్తూ ఉంటారు. కుర్ర హీరోయిన్ రాశీఖన్నా కూడా ఇదే తరహాలో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోందట. అమ్మడు షూటింగ్ పూర్తయిన తర్వాత పార్టీల్లో సందడి చేస్తుంది. పబ్బులు, డిస్కోథెక్‌లలో హల్‌చల్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది.  ప్రతిరోజు పార్టీల్లో దర్శనమిస్తుందంటే రాశీఖన్నా ఎంత స్పీడో అర్థమవుతుంది. పార్టీలు ఇవ్వడం, తీసుకోవడం విషయంలో కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోదట ఈ భామ. అర్ధరాత్రి వరకు ఈ భామ పార్టీల్లోనే గడుపుతుందని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇది కాక తనే స్వయం గా ఇంట్లో తెగ పార్టీలిస్తోంది. వాటికి మన యువహీరోలు లొట్టలేసుకుంటూ వెళ్తున్నారు .

దీనిపై యంగ్ హీరోయిన్ రాశీఖన్నా మాట్లాడుతూ “నాకు నైట్ లైఫ్ అన్నా.. పార్టీలన్నా మహా ఇష్టం. ఇందులో తప్పేమీ లేదు. నేను షూటింగ్‌కు ఆలస్యంగా వస్తే తప్ప… నా మీద ఫిర్యాదు చేసే అవకాశం ఎవ్వరికీ లేదు. రాత్రంతా పార్టీలో ఎంజాయ్ చేసినా ఉదయాన్నే సమయానికి షూటింగ్‌కు వచ్చేయగలను”అని చెప్పింది.

బహుభాషానటిగా రాణించాలని …

కోలీవుడ్‌లో పాగా వేయడానికి నటి రాశీఖన్నా తహతహలాడుతోంది. ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా బాగానే పాపులర్‌ అయ్యింది. అయితే బహుభాషానటిగా రాణించాలని ఆశిస్తోందట. ఆ దిశగా ప్రయత్రాలు ముమ్మరం చేసింది. అందాలారబోతకు ఏమాత్రం వెనుకంజవేయని రాశీఖన్నా అనుష్క, సమంత, కాజల్‌అగర్వాల్‌ల వంటి ప్రముఖ కథానాయికల బాటలో పయనం మొదలెట్టింది.

తొలుత బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసి, ఆ తరువాత తెలుగు చిత్రసీమలోకి వచ్చింది.  తాజాగా కోలీవుడ్‌పై దృష్టిసారించింది. ఇక్కడ యువ నటులు సిద్దార్థ్‌ తో ‘సైతాన్‌ కా బచ్చా’ చిత్రంలోనూ, నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఇమైకా నోడిగళ్‌’ చిత్రంలో అధర్వకు జంటగానూ నటిస్తోంది. వీటిలో ‘ఇమైకా నోడిగళ్‌’ చిత్రం వచ్చే నెలలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది.

కాగా కోలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో రొమాన్స్‌ చేసే అవకాశాల వేట మొదలెట్టిందట. గత వారం చెన్నైకి వచ్చిన రాశీఖన్నా ఇక్కడి ప్రముఖ దర్శకులను కలిసి చాన్సుల కోసం ప్రయత్నించిందట. త్వరలోనే స్టార్‌ హీరోలతో కలిసి నటిస్తాననే ధీమాను వ్యక్తం చేస్తోంది. పనిలో పనిగా మలయాళంలోనూ చేస్తోంది. అక్కడ మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘విలన్‌’ చిత్రంతో రంగప్రవేశం చేసింది. తదుపరి శాండిల్‌వుడ్‌పై దృష్టి పెడుతుందేమో…