మంచిపాత్ర కోసం పదేళ్ళు అయినా వేచిఉంటా!

“అవకాశాలు వస్తున్నాయి కదా అని అన్నీ ఒప్పేసుకోన”ని రష్మిక స్పష్టం చేసింది. తాను అంగీకరించిన చిత్రాలకు నూరు శాతం సహకరిస్తానని…ఒక మంచి పాత్ర కోసం పదేళ్ళు అయినా వేచి ఉంటాన”ని నటి రష్మిక అంటోంది.
రష్మిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ … “ప్రముఖ కథానాయకులతో నటించే అవకాశాలు వస్తున్నాయని, విశ్రాంతి లేకుండా నటించడం సంతోషంగా ఉందని చెప్పింది. అయితే ఎన్ని చిత్రాల్లో నటించినా, ఎంత పెద్ద స్టార్స్‌తో జత కట్టినా.. గర్వం లేకుండా,నిరాడంబరంగా ఉంటానని అంది. ఇంకా చెప్పాలంటే తనకు అలంకారాలు, ఆడంబరాలు అస్సలు నచ్చవని చెప్పింది. సినిమాల కోసం అందంగా కనిపించినా..నిజజీవితంతో అలా అవసరం లేదని పేర్కొంది. తనకు మేకప్‌ వేసుకోవడం..అలంకరించుకోవడం నచ్చదని అంది. తన లాంటి నటీమణుల్ని చూడడానికి ప్రేక్షకులు  ఇష్టపడతారా? అని తొలి చిత్రంలో నటించినప్పుడు భయపడినట్లు…అయితే కథలో పాత్ర బాగుంటే గ్లామర్‌ లేకపోయినా ఆదరిస్తారని- ఆ తరువాత అర్థమైందని పేర్కొంది. తనకు సహజంగా ఉండడమే నచ్చుతుందని.. షూటింగ్‌లకు కాకుండా బయటకు వెళితే ఎలాంటి మేకప్‌ వేసుకోకుండానే వెళతాన”ని రష్మిక అంటోంది.
యాక్టర్స్‌ మీద విమర్శలు చేస్తే ఏమొస్తుందో ?
‘‘మేం చేసే సినిమాలను విమర్శించే హక్కు ఉండొచ్చు. కానీ మా వ్యక్తిగత విషయాలతో … కించపరిచేలా మాట్లాడే అధికారం ఎవరికీ లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది రష్మికా మందన్నా. సోషల్‌ మీడియాలో తాజాగా ఓ పోస్ట్‌ ఆమెను వ్యక్తిగతంగా కించపరుస్తూ…విజయ్‌ దేవరకొండతో ఎఫైర్‌ నడుపుతున్నారనే ఉద్దేశం ధ్వనించేలా వచ్చింది. అది రష్మికను కోపానికి గురి చేసింది. ఆ పోస్ట్‌ని షేర్‌ చేస్తూ .. రష్మిక  తన కోపాన్ని వ్యక్తం చేసింది…
‘‘యాక్టర్స్‌ మీద ఇలాంటి విమర్శలు చేస్తే మీకు ఏమొస్తుందో అర్థం కావడం లేదు. యాక్టర్స్‌ అంటే తేలిగ్గా టార్గెట్‌ చెయ్యోచ్చనా ? పబ్లిక్‌ ఫిగర్‌ అయినంత మాత్రాన మమ్మల్ని టార్గెట్‌ చేయడం సరికాదు. ‘నెగటివ్‌ కామెంట్స్‌ని పట్టించుకోకు’ అని చాలామంది చెప్పారు. చాలా కామెంట్స్‌ని పట్టించుకోవద్దనే అనుకుంటాను. ఏ యాక్టర్‌ కూడా ఇలాంటి విమర్శలను ఎదుర్కోకూడదు. యాక్టర్‌గా ఉండటం అంత తేలిక కాదు. ప్రతీ వృత్తిని గౌరవించాలి…అన్నింటికంటే ముందు ఒకరినొకరు గౌరవించుకోవాలి…అని రష్మిక పేర్కొంది .
రష్మిక మందన్నాప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరూ’, అల్లుఅర్జున్‌తో, నితిన్‌కు జంటగా ‘భీష్మా’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అదే విధంగా కోలీవుడ్‌లో కార్తీతో ‘సుల్తాన్‌’ అనే చిత్రంలో నటిస్తోంది.