సినిమా అంటే డబ్బు మాత్రమే కాదు!

“సినిమా అంటే డబ్బు మాత్రమే కాదు. ఆ సినిమా కోసం మనం ఎంత కష్టపడ్డామనేదే ముఖ్యమైన విషయమ”ని రష్మిక చెప్పింది. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అయితే ఆమెఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందట.
తెలుగులో నానీ హీరోగా నటించిన ‘జెర్సీ’ షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా రష్మికను చేయాలని కోరారట. అయితే రష్మిక నో చెప్పిందట. ఈ సినిమాను చేయలేనని, తన పాత్రకు న్యాయం చేయలేనని తేల్చి చెప్పిందట. దీంతో చేసేందేమి లేక చిత్రయూనిట్ మరో హీరోయిన్‌ను వెతుక్కునే పనిలో పడిందట.
అయితే , రష్మిక ఈ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చినా పక్కన పెట్టేసింది. రెమ్యునరేషన్ వల్లే రష్మిక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. అయితే వీటిపై రష్మిక వివరణ ఇచ్చింది…..
 
“జెర్సీ’ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినపుడు..అందులో నా పాత్రకు న్యాయం చేయలేనపించింది. శ్రద్దాశ్రీనాథ్ లా ఆ పాత్రలో ఇమిడిపోయి నటించాలి. దానికి నేను రెడీగా లేను. సినిమా విజయానికి హీరో, హీరోయిన్ల నటన చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సినిమా అంటే డబ్బు మాత్రమే కాదు. ఆ సినిమా కోసం మనం ఎంత కష్టపడ్డామనేదే కూడా ముఖ్యమ”ని రష్మిక చెప్పింది.
 
దేన్నీ సులభంగా వదలిపెట్టను
“మూడేళ్లుగా విరామం లేకుండా నటిస్తున్నాను .ఇలా రెస్ట్‌ లేకుండా నటించడం వల్ల తనకు తానే శారీరకంగానూ, మానసికంగానూ అలసటను కొనితెచ్చుకుంటున్నాను” అని రష్మిక చెప్పింది. వారంలో ఆదివారం అయినా విరామం దొరుకుతుందేమోనని శరీరం తపిస్తోందని అంది. దీంతో, ‘పనే ముఖ్యం కాదని, శరీరంపైనా శ్రద్ధచూపడం అవసరం అన్న విషయం’ అని అర్థమైందని పేర్కొంది. ప్రస్తుతం ఒకేసారి నాలుగు చిత్రాల్లో నటిస్తున్నానని…అయితే ఇకపై అలాంటి తప్పు చేయకూడదని భావిస్తున్నానని చెప్పింది. ‘ఎన్ని చిత్రాలు చేసినా.. వాటి ద్వారా మనం ఏం నేర్చుకున్నామన్నది ముఖ్యం’ అని పేర్కొంది. రెండు నెలలకు ముందు తాను డెంగీ వ్యాధికి గురయ్యానని..ఆ సమయంలో అవుట్‌ డోర్‌ షూటింగ్‌లో ఉన్నా..డెంగీతో బాధపడుతూనే, శరీరం సహకరించకపోయినా నటించానని చెప్పింది. పోరాడే గుణం ఉన్నదాన్ని కావడంతో.. దేన్నీ సులభంగా వదలిపెట్టనని రష్మిక మందనా చెప్పింది .