యుద్ధ భూమిలో ఉన్నాం.. విజయం సాధిస్తాం!

“యుద్ధ భూమిలో ఉన్నాం.. విజయం సాధిస్తాం..” అంటోంది నటి రష్మికా మందన్నా. ప్రముఖులు తమవంతు సాయం చేయడంతో పాటు ..కరోనా మహమ్మారి నుండి  ప్రజలకు తగినంత మనోధ్యేర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.  రష్మిక  లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో ట్విట్టర్‌లో చేతిలో వెలుగుతున్న జ్యోతిని పట్టుకున్న ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘ఒక్క క్షణం కూడా మనోధైర్యాన్ని కోల్పోకండి. మనం ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నాం. విజయం సాధిస్తాం. ఇతరులకు సాయం చేయండి” అని పేర్కొన్నారు.
చిత్తూరు యాసను పక్కాగా…
రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఈ చిత్రంలో రాయలసీమ యాస మాట్లాడే పుష్పరాజ్‌ అనే పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్‌. ఇప్పుడు రష్మికా మందన్నా కూడా ఆ యాసపై పట్టు సాధించేందుకు హోమ్‌ వర్క్‌ చేస్తున్నారని తెలిసింది. చిత్తూరు యాసను పక్కాగా నేర్చుకోవడానికి రష్మికకు మంచి సమయం దొరికినట్లయింది. రష్మికాయే కాదు.. ‘పుష్ప’ టీమ్‌ అంతా ఈ సమయాన్ని ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌కు బాగా వినియోగించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
నాకు చాలా స్పెషల్ మూవీ!
‘భీష్మ’,’ సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన రష్మిక మందన్న నెక్స్ట్ ‘పుష్ప’ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే . ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత పెద్దగా ఉండబోదనీ, పైగా గ్లామర్ చూపించే అవకాశం కూడా ఉండదని వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ రష్మిక మాత్రం ‘పుష్ప’ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. ఈ సినిమా స్టోరీ లైన్ తనకు బాగా నచ్చిందనీ, ఇంతకుముందెన్నడూ ఇలాంటి కథని మనం చూడలేదనీ చెబుతోంది. అయితే ఈ సినిమాలో తన పాత్రేంటో మాత్రం ఆమె చెప్పడం లేదు. “నో డౌట్.. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. నాకు నటిగా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది. గ్లామర్ తదితర విషయాలన్నీ ముందు ముందు తెలుస్తాయి” అని రష్మిక ఈ సినిమా గురించి చెప్పింది
 
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.