నిశ్చితార్థం రద్దయితేనేం… ఫుల్ బిజీ !

రష్మిక మండన్నా…  ‘ఛలో’, ‘గీత గోవిందం’ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ చిత్ర విజయాలతో రష్మిక పేరు టాలీవుడ్‌లో మారు మోగిపోతోంది. అందం, అంతకుమించిన నటన, హావభావాలతో తెలుగు ప్రేక్షకులను భలే కట్టిపడేసింది. అందుకే ఫేవరెట్‌ కథానాయికగా మారిపోయింది.తెలుగు దర్శక నిర్మాతలు ఆమెకు ఆఫర్లు మీద ఆఫర్లు ఇస్తున్నారట. కానీ తెలుగులో నటించడానికి ప్రస్తుతానికి డేట్స్‌ ఖాళీగా లేవట. ఇప్పటికే రెండు సినిమాలు కన్నడలో చేసేందుకు కమిట్‌ అయిందట. అందువల్లే వెంటనే తెలుగు చిత్రాలు చేసేందుకు ఇప్పటికిప్పుడు డేట్స్‌ ఇవ్వడం సాధ్యం కావడం లేదట. అయినా రెండు చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపిందట.తాజాగా నితిన్‌తో సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. నితిన్‌ ప్రస్తుతం ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి ‘భీష్మ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రంలో నితిన్‌ సరసన రష్మికను ఫైనల్‌ చేశారట. రష్మిక మండన్నా ఇప్పుడు నాగార్జున, నాని కాంబినేషన్‌లో రూపొందుతోన్న మల్టీస్టారర్‌లో నానికి జోడీగా చేస్తోంది. విజయ్ దేవరకొండ తో ‘డియర్‌ కామ్రేడ్‌’లోనూ నటిస్తోంది.
 
లిప్ లాక్ వల్లనే నిశ్చితార్థం రద్దు
ఇదిలా ఉంటే, కన్నడ నటుడు రక్షిత్‌తో రష్మిక మందన్నా నిశ్చితార్థం గతేడాది జరిగిన విషయం విదితమే. అది రద్దయినట్టు రష్మిక తల్లి సుమన్‌ ఇటీవల మీడియాకి తెలిపారు. ‘మేం డిస్టర్బ్‌ అయ్యాం. ప్రస్తుతం కోలుకుంటున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.  ఈ నిశ్చితార్థ రద్దుపై పలు రకాల వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో నటుడు రక్షిత్‌ కూడా స్పందిస్తూ… ‘రష్మికను టార్గెట్‌ చేయవద్దు. ఆమెకు ప్రశాంతత కల్పించాల’ని ఫేస్‌బుక్‌ ద్వారా కోరారు. రష్మిక, రక్షిత్‌ కన్నడ ‘కిరిక్‌ పార్టీ’ సినిమా టైమ్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.’గీత గోవిందం’ చిత్రంలో ఘాటు రొమాన్స్ తో పాటుగా లిప్ లాక్ వల్ల హీరోయిన్ రష్మిక మందన్న వివాహ నిశ్చితార్థం రద్దు అయ్యింది .
 
కన్నడ ‘కిరిక్‌ పార్టీ’ సినిమా టైమ్‌లో నటిస్తున్న సమయంలో రక్షిత్ – రష్మిక ప్రేమలో పడ్డారు . సినిమా రిలీజ్ అయ్యేనాటికి పూర్తిగా ప్రేమలో మునిగిపోయారు. దాంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు రష్మిక, రక్షిత్‌ .అప్పుడే ఆమెకు తెలుగులో వరుసగా రెండు ఛాన్స్ లు వచ్చాయి . ‘ఛలో’ సూపర్ హిట్ అయ్యింది. దాంతో రష్మిక ఎంగేజ్ మెంట్ అయిపొయింది . ‘ఛలో’ హిట్ అయ్యాక ‘గీత గోవిందం’ లో ఛాన్స్. అది బ్లాక్ బస్టర్ కావడంతో ‘లిప్ లాక్’… రక్షిత్ – రష్మిక ల మధ్య వివాదానికి కారణం అయ్యిందట.  ఆ గొడవ మరీ ఎక్కువ కావడం … పలు చిత్రాల్లో ఆఫర్స్ వస్తూ, స్టార్ స్టేటస్ అందుకునే ఛాన్స్ రావడంతో రక్షిత్ తో ఎంగేజ్ మెంట్ ని రద్దు చేసుకుందట రష్మిక .