ఈ ఏడాది నాది ఎప్పటికీ మరచిపోలేని ‘బిగ్ బర్త్ డే’ !

రష్మికా మందన్నా… అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌  స్థానానికి చేరింది. చేసింది కొన్ని సినిమాలే అయినా ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం రష్మిక చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీ. ఏకకాలంలో బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేసేస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’లో నటిస్తూనే, బిగ్‌బి అమితాబ్‌తో కలిసి ‘గుడ్ బాయ్’ అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ల కంటే ముందే ఈ ఆమెకి  ఓ మంచి ఆఫర్‌ వచ్చింది. స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సరసన జెర్సీ రీమెక్‌లో నటించేందుకు మొదట రష్మికనే సంప్రదించారట. బాలీవుడ్‌ పిలుపు కోసం మన హీరోయిన్లు తహతహలాడుతుంటే.. రష్మిక మాత్రం ఈ ఆఫర్‌ను తిరస్కరించింది. “‘జెర్సీ’ మూవీలో నాని సరసన హీరోయిన్‌గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించిందని,ఆ పాత్రకు ఆమెకన్నా గొప్పగా ఎవరూ న్యాయం చేయలేరని భావించిందట. అందుకే తాను ఈ సినిమా ఒప్పుకోలేదని తెలిపింది. ఇక తెలుగులో జెర్సీని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరే బాలీవుడ్‌లోనూ రీమేక్‌ను డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇందులో షాహిద్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.

అమితాబ్‌ తో కలిసి పుట్టినరోజు… రష్మికా మందన్నా ఈ ఏడాది జరుపుకొన్న పుట్టినరోజును ఎప్పటికీ మరచిపోలేనంటోంది. విశేషం ఏమిటంటే… బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి పుట్టినరోజు సెలబ్రేట్‌ చేసుకుంది. అందుకే రష్మికాకు ఇది నిజంగా ‘బిగ్‌’ బర్త్‌ డే. వికాశ్‌ బల్‌ దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్‌, రష్మికా మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ చిత్రం ‘గుడ్‌ బై’. ఈ వారమే ఈ సినిమా షూటింగ్‌ ముంబయ్‌లో మొదలైంది.ప్రస్తుతం అమితాబ్, రష్మికలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మార్చి 5న రష్మికా మందన్నా పుట్టినరోజు. కానీ బర్త్‌ డే బ్రేక్‌ తీసుకోకుండా ‘గుడ్‌ బై’ చిత్రీకరణలో పాల్గొన్నారామె. లొకేషన్‌లో జరుపుకున్న పుట్టినరోజు వేడుక ఫొటోలను రష్మిక సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ సినిమా కాకుండా హిందీలో రష్మిక ‘మిషన్‌ మజ్ను’ అనే సినిమా చేస్తోంది.

మొదట నమ్మలేదు!… అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని చెబితే తన పేరేంట్స్‌ తనను నమ్మలేదని చెప్పింది. తన తల్లిదండ్రులిద్దరూ బిగ్‌బికి పెద్ద ఫ్యాన్స్‌ అని, ఆయన సినిమాలన్నీ తప్పకుండా చూస్తారని చెప్పుకొచ్చింది. ఇటీవలె గుడ్‌ బై సెట్లో బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్న రష్మిక..ఇది ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్న సంగతి తెలిసిందే. వికాశ్‌ బల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ కూతురిగా రష్మిక కనిపించనుంది. ఇక కోలీవుడ్‌లో ఆమె నటించిన డెబ్యూ చిత్రం ‘సుల్తాన్‌’ ఇటీవలె విడుదలయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన పాన్‌ఇండియా మూవీ ‘పుష్ప’లో నటిస్తోంది.