ఆ కలలే నన్ను ఇంకా కష్టపడేలా చేస్తాయి !

“స‌క్సెస్” వచ్చిందంటే ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఫుల్ సక్సెస్ లో ఉన్న క‌న్న‌డ బ్యూటీ రష్మికా మందన్నా పెద్ద మొత్తంలో రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేస్తూ నిర్మాత‌ల‌కు షాకిస్తోంది. క‌న్న‌డ చిత్ర పరిశ్ర‌మ‌లో ల‌క్ష‌ల్లోనే పారితోషికం అందుకున్న ఈమె టాలీవుడ్‌కు మ‌కాం మార్చాక రేటు పెంచేసింది. తెలుగులో తొలి చిత్రం ‘ఛ‌లో’తో ప్రేక్ష‌కుల‌ దృష్టిని ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ త‌ర్వాత న‌టించిన ‘గీతా గోవిందం’ కూడా బంప‌ర్ హిట్ సాధించింది. దీంతో భారీ చిత్ర  నిర్మాత‌ల నుంచి ఆఫ‌ర్లు ఆమె కోసం క్యూ కట్టాయి. అలా స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని పట్టేసింది. ఇప్పుడు ర‌ష్మిక తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.  ‘గీతాగోవిందం’ స‌క్సెస్ వ‌ర‌కు ఆమె సినిమాకు రూ.50 ల‌క్ష‌లలోపే తీసుకుంది.. కానీ సంక్రాంతి బ‌రిలోకి దిగిన‌ మ‌హేశ్‌బాబు సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ విజ‌యానందంలో  ర‌ష్మిక త‌న‌ రెమ్యూన‌రేష‌న్‌ను రెండు కోట్ల రూపాయ‌ల‌కు పెంచింద‌ట‌. తెలుగులో కొన్నేళ్లుగా సినిమాలు చేస్తున్న కొంద‌రు హీరోలు కూడా ఇంత పారితోషికం అందుకోక‌పోవ‌డం గ‌మనార్హం. కాగా ర‌ష్మిక ప్ర‌స్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’, శ‌ర్వానంద్ ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ చిత్రంలో న‌టిస్తోంది.

లాక్‌డౌన్‌ లో మానసిక జాగ్రత్తలు ?
ప్రతీ ఒక్కరికీ ఇది ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ కరోనా అనేది ఎప్పటికీ ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కరోనా అంతం అయ్యాక.. లాక్‌ డౌన్‌ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేదే ? అని మాత్రం బాధపడకూడదు. అందుకే ఎవరి వృత్తికి సంబంధించి వారు ఏదో ఒకటి నేర్చుకుంటే.. ఆతర్వాత బాధపడే స్కోప్‌ ఉండదు.

మీ స్ఫూర్తి మంత్రం ఏంటి?
కెరీర్‌లోనూ, లైఫ్‌లోనూ ఎంతో ఎత్తుకి ఎదగాలని నా ఆశ. ఇది సాధిస్తే చాలు అనుకోను. అన్నీ సాధించాలనుకుంటాను. నాకు నేను హద్దులు పెట్టుకోను. బాలీవుడ్‌ సినిమాలు చేయాలి. హాలీవుడ్‌ సినిమాలు చేయాలి. ఆ కలలే నన్ను ఇంకా కష్టపడేలా చేస్తాయి. ప్రస్తుతం బుడిబుడి అడుగులే వేస్తున్నా. కానీ నా కలలను చేరుకుంటా.

మీ స్ట్రెస్‌బస్టర్‌ ఏంటి? 
బాగా స్ట్రెస్‌ అనిపిస్తే వర్కౌట్స్‌ చేస్తా. అలాగే సంగీతం వింటాను. పిచ్చిపట్టినట్టు డ్యాన్స్‌ చేస్తాను. అంతే.. ఒత్తిడి మాయం అయిపోతుంది.

అందరితో దయగా ఉండాలి !… “నా దారిలో ఏది ఎదురొచ్చినా నవ్వుతూ పలకరించడమే నాకు అలవాటు. అది మంచైనా, చెడైనా సరే. నవ్వుతూనే పలకరిస్తాను’’ అంటోంది రష్మికా మందన్నా. అది తన స్వభావమట. ‘‘ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు ఇబ్బందుల్లో పడుతూనే ఉంటారు. కొంతమంది ఆ రోజు బావుండకపోవచ్చు. ఆ బాధలో నా దగ్గరికొస్తే అవన్నీ మర్చిపోయేలా చేయాలనుకుంటాను. నా నవ్వు మంత్రమేసి కాసేపైనా వాళ్లను సంతోషంగా ఉండేలా చేయాలనుకుంటాను. అందరితో దయగా ఉండాలి. దానికోసం ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదు. బాధల్లో ఉన్నవారికి ఊరట కలిగించేలా సౌమ్యంగా మాట్లాడితే చాలు. అంతే.. అందువల్ల మన సంపాదన ఏమీ తరిగిపోదు’’ అని అంది.