కొత్త ప్రయాణం !.. ఈ అనుభవం బాగుంది !!

‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’.. ఇలా వరుస హిట్లతో దూసుకెళుతున్న రష్మిక మందన్నా కొత్త ప్రయాణం మొదలుపెట్ట బోతోంది. తెలుగు,కన్నడ భాషా చిత్రాల్లో సత్తా చాటిన ఈ అమ్మడు ఇటీవల బాలీవుడ్‌లోకి కూడా ప్రవేశించింది. బాలీవుడ్‌లో ‘మిషన్‌ మజ్ను’ అనే సినిమాలో కథానాయికగా నటించనుంది రష్మికా. ‘‘మీ అందరికీ ఓ న్యూస్‌ చెప్పబోతున్నాను. కొత్త ప్రయాణం ఆరంభమైంది. చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను’’ అని  రష్మిక చెప్పింది. భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక కోవర్ట్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో శాంతను బాగ్చి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరో. ఇక రష్మికా బాలీవుడ్‌ ఎంట్రీపై ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఎంట్రీయే దేశభక్తి సినిమాతో అంటే ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో మంచి లాంచింగ్‌ అనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప’, ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’, ‘పొగరు’ తదితర చిత్రాల్లో నటిస్తోంది రష్మికా మందన్నా.

మ్యూజిక్ ఆల్బమ్ ‘టాప్ టక్కర్’లో…  రష్మికా మందన్నా తాజాగా  ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో కూడా నటించడం విశేషం. ‘టాప్ టక్కర్’ పేరుతో ఈ వీడియో ఆల్బమ్‌ను తెరకెక్కించారు. తాజాగా ఈ ఆల్బమ్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసారు. ఈ పాటను.. ఉచానా అమిత్ బాద్‌షా, యువన్ శంకర్ రాజా, జోనితా గాంధీ పాడారు. ఈ పాటను ఉచానా అమిత్ బాద్‌షానే రాయడం విశేషం. ఈ పాటలో రష్మిక మందన్న తలపై సిక్కు పాగాతో  కొత్త అవతారంలో క్రేజీగా కనిస్తోంది. ‘టాప్ టక్కర్’కు సంబంధించిన పూర్తి  పాటను త్వరలో విడుదల చేయనున్నారు.

‘టాప్‌ టక్కర్‌’ ఆల్బమ్‌ సాంగ్‌ గురించి రష్మిక చెబుతూ..”మ్యూజిక్ ఆల్బమ్ లో నేను డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి. ఈ అనుభవం బాగుంది. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది కూడా. ఇది త్వరలో మీ ముందుకు రానుంది. ఇకపై పెళ్లిళ్లు, కాలేజీలు.. వంటి చోట ఈ ఆల్బమ్ వినిపిస్తుందనుకుంటున్నాను.. దీని కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది.

విజయ్ సరసన బంపర్‌ ఆఫర్ ?…  కోలీవుడ్‌లో ఓ బంపర్‌ ఆఫర్‌ను దక్కించుకున్నారట రష్మికా మందన్నా. తమిళ ‘డాక్టర్‌’ సినిమా ఫేమ్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో మాస్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా రష్మికా మందన్నా పేరు బలంగా వినిపిస్తోంది. విజయ్‌కు జోడీగా రష్మికా కనిపిస్తుందా? అనే విషయంపై త్వరలో క్లారిటీ రానుంది. ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌లో ఆరంభం కానుందనే ప్రచారం జరుగుతోంది. రష్మికా మందన్నా తమిళంలో  కార్తి తో నటించిన తొలి సినిమా ‘సుల్తాన్‌’ ఏప్రిల్‌ 2న విడుదల కానుంది.