ఆమెకు అభిమానులు ఓ రేంజ్‌లో ఉన్నారు !

రష్మిక మందన్న… గీత గోవిందం’ చిత్రంలో ఆమె నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె సామాజిక మాధ్యమాల్లో చాలా తక్కువగా టచ్‌లో ఉంటుంది. రష్మికపెళ్లి కి సంబంధించిన ఓ వ్యవహారంపై సోషల్‌మీడియాలో రచ్చరచ్చ కావడంతో దీనికి కాస్త దూరంగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా చేస్తోన్న ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈమె తన ట్విట్టర్‌ ఖాతాలో సంప్రదాయ దుస్తులు ధరించిన దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్‌ పెట్టిందో లేదో గంటలో వేలల్లో లైక్స్‌ లభించాయి. అంటే రష్మిక అభిమానులు ఏ రేంజ్‌లో ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. దక్షిణ భారత దేశంలో ఇటువంటి సంప్రదాయ దుస్తులను ఎక్కువ ఇష్టపడడం కూడా మరో కారణం. “ఏవో కొన్ని రోజులే ఇలా సంప్రదాయకాన్ని తీసుకొస్తాయి” అని రష్మిక పేర్కొంది.
మైనస్ 2 డిగ్రీల చలిలో పాట
గత ఏడాది ‘ఛలో’తో ఓ బ్లాక్‌బస్టర్‌ను ‘గీత గోవిందం’తో ఓ ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ రష్మిక మందన్నకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆతర్వాత చేసిన ‘దేవదాస్’ చిత్రం సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఇక వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌కు జోడీగా రష్మిక ఓ సినిమా చేయనుంది. దీంతో పాటు కన్నడ సినిమాలతో ఆమె బిజీగా ఉంది. ఇటీవల అక్కడ స్టార్ హీరో దర్శన్‌తో ‘యజమాన’ అనే సినిమాలో నటించింది. అందులో ఓ పాటను స్వీడన్‌లో చిత్రీకరించారు. మంచు దట్టంగా కురుస్తూ అసలు మనుషులు కనిపించలేనంత పొగ కమ్ముకున్న వాతావరణంలో మైనస్ 2 డిగ్రీల చలిలో ఈ పాటను చిత్రీకరించారట. సినిమా యూనిట్ మొత్తం గజగజ వణుకుతున్నా దర్శన్, రష్మికలు మాత్రం ఈ పాటలో హుషారుగా స్టెప్పులు వేయడంతో అందరూ షాక్ అయ్యారట. ఈ పాట తన కెరీర్‌లో సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలుస్తుందని రష్మిక పేర్కొంది.