ఆ హీరోల సేవలు నాలో కొత్త ఆశను రేకెత్తించాయి !

రష్మిక మందన్న తొలి సినిమా ‘ఛలో’ సూపర్‌ హిట్‌తో  మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ ‘గీతగోవిందం’తో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఆమె ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌, ‘భీష్మ’ హిట్తో సూపర్ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. తాజాగా కరోనా పరిస్థితుల గురించి వివరిస్తూ రష్మిక సోషల్‌ మీడియా ఖాతాలలో ఒక వీడియో రిలీజ్‌ చేసింది…

“అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా!.. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించలేకపోయాం. కోవిడ్ వల్ల దైనందిన జీవితాల్లో ఎన్నో ఆకస్మిక మార్పులు వచ్చాయి. గతేడాది నెలకొన్న పరిస్థితులే మళ్లీ వచ్చాయని తెలియడానికి నాకు ఇంత సమయం పట్టింది. అయితే, ఇలాంటి సమయంలోనే మనం పాజిటివ్‌గా ఉండటం మంచిది. మనం ఈ యుద్ధాన్ని గెలిచేందుకు చాలా దగ్గరలో ఉన్నాం. ఆర్డినరీ హీరోలు.. ఎక్స్‌ట్రార్డినరీగా పనిచేస్తున్న వారి గురించి  మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా. వాళ్లు చేస్తున్న కార్యక్రమాలు నాలో కొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఏ భాష మాట్లాడతాం? వంటివి ఏమీ అవసరం లేదు.. ఎలాంటి పనులు చేస్తున్నామనేదే ముఖ్యం. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మీ ముఖం మీద చిరునవ్వు తీసుకురావడంతో పాటు ఆ హీరోలకు కృతజ్ఞతలు చెప్పడానికి నేనీ వీడియో చేశాను”అని చెప్పుకొచ్చింది.

 

ఒకరోజు ప్రభాస్‌తో డేటింగ్‌కు వెళ్తా!… రష్మిక మందన్నతాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..డేటింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఒకవేళ తనకు అవకాశం వస్తే ఒకరోజు ప్రభాస్‌తో డేటింగ్‌కు వెళ్తానని చెప్పింది. తాను ‘ప్రభాస్‌కు చాలా పెద్ద ఫ్యాన్‌’ అని తన మనసులోని మాటను బయటపెట్టేసింది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్‌ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’  రష్మిక  చేస్తోంది.  ఇటీవలె కార్తీ సరసన  ‘సుల్తాన్‌’ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా ఫ్లాప్‌ అయినప్పటీకీ.. ఈ కన్నడ బ్యూటీ పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

హిందీ భాష పై పట్టు సాధించాలని… దక్షిణాది అగ్రతారల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు రష్మిక మందన్న.. ఇప్పుడు ఉత్తరాదిన కూడా సినిమాలు చేస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌ మెయిన్‌ లీడ్‌ చేస్తున్న ‘గుడ్‌ బై’,  సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘మిషన్‌ మజ్ను’ చిత్రాల్లో రష్మిక హీరోయిన్‌గా చాన్స్‌ దక్కించుకుంది . అలాగే బీ టౌన్‌లో  ముచ్చటగా మూడో ప్రాజెక్ట్‌కు కూడా సైన్‌ చేసినట్లు ఇటీవల రష్మిక తెలిపింది .

హిందీ చిత్రాల్లో డైలాగ్స్‌ స్పష్టంగా పలకడం కోసం హిందీ భాష పై పట్టు సాధించాలని  నిర్ణయించుకున్న రష్మిక.. ఇందుకోసం ఓ హిందీ ట్యూటర్‌ను కూడా నియమించుకుని పాఠాలు చెప్పించుకుంటున్నారట. అంతేకాదు.. హిందీ భాషను త్వరగా నేర్చుకునేందుకు ఇంట్లో, స్నేహితులతో కూడా ఎక్కువగా హిందీలోనే మాట్లాడుతోందట. పైగా ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా ఆమెకు బోలెడంత సమయం దొరికినట్లయింది. ఈ ఖాళీ సమయాన్ని హిందీ నేర్చుకోవడానికి సద్వినియోగం చేస్తోంది రష్మికా .