నటన పెద్దగా రాదు.. అంత అందగాత్తెనూ కాను !

రష్మిక మండన్న… ‘ఛలో’, ‘గీత గోవిందం’లో గీతగా కనిపించిన ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ హాట్ ఫేవరెట్. కన్నడ నటి రష్మిక ఇప్పుడు.. అక్కడి కంటే ఇక్కడే ఎక్కువ హడావిడి చేస్తోంది. ఆమె తాజా చిత్రం ‘దేవదాస్’ యావరేజ్ అయ్యింది. అయినా కూడా దర్శక, నిర్మాతలు రష్మిక కోసం ఎగబడుతున్నారు. శాండల్ వుడ్‌లో ఓ మోస్తరు సక్సెస్ అందుకున్న రష్మిక ‘ఛలో’ అంటూ తెలుగులో కొచ్చి..అన్ ఎక్స్‌పెక్టెడ్ సక్సెస్ అందుకుంది. ఆ తరువాత మరో భారీ హిట్ రూపంలో ‘గీత గోవిందం’ రష్మిక ఆమె కెరీర్ లో నిలిచింది. ఇంకేముంది రష్మిక హాట్ ప్రాపర్టీగా మారిపోయింది.తెలుగులో రష్మిక ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరొయిన్.
 
ఇన్ని ఆఫర్లు తనని వెదుక్కుంటూ వస్తోన్నా రష్మిక మాత్రం ..తనకంత సీన్ లేదని అనేస్తోంది. తనకింత క్రేజ్ ఎలా వచ్చిందో కూడా అర్థం కావటం లేదని మనసులో మాట బయటపెట్టింది. రష్మిక తనకు నటన పెద్దగా రాదని చెప్పేసింది. తాను ఇంకా యాక్టింగ్‌లో ఏబీసీడీల వద్దే ఉన్నానని చెప్పేసింది. ప్రతీ సినిమాలో తాను ఇంకా బెటర్ అయ్యేందుకు ప్రయత్నిస్తోందట.
 
అలాగే.. తన అందం గురించి కూడా అందరూ తెగ పొగుడుతున్నారు, కానీ.. స్వయంగా తనకి మాత్రం ఆ ఫీలింగ్ లేదని అంటోంది. నా కంటే బోలెడు మంది అందగత్తెలు ఇండస్ట్రీలో ఉన్నారని ఆమె చెప్తోంది. జనరల్‌గా ఇలా మాట్లాడటం హీరోయిన్స్ విషయంలో చూడలేం! నటన రాని వాళ్లు, అందం లేని వాళ్లే ఆ నిజాల్ని ఒప్పుకోరు. ఇక ఉన్నవారు వెనక్కి తగ్గుతారా? కానీ, రష్మిక రివర్స్ రూట్‌లో వస్తోంది! తన గురించి తానే నెగటివ్‌గా మాట్లాడుతూ తెలివిగా..ప్రేక్షకుల అంచనాలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
విజయ్ దేవరకొండతో ఆమె మరోసారి ‘డియర్ కామ్రేడ్’ మూవీలో కనిపించబోతోంది. మరో యంగ్ హీరో నితిన్ తో కూడా ‘భీష్మ’ సినిమాలో ఆడిపాడనుంది. ఈ సినిమాలు కాక త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీలోనూ, శర్వానంద్ సరసన కూడా రష్మిక కనిపించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.