అసలు విషయం తెలియకనే చిరాకుపడ్డా !

రష్మికా మందణ్ణ… టాలీవుడ్‌లో తాజా సంచలనమైన ఈబ్యూటీ తన డేట్స్ వేస్ట్ అవడం పట్ల చాలా అసహనం వ్యక్తం చేసిందట. తీరా అసలు కారణం తెలిసి షాకయిందట.రష్మిక కమిట్ అయిన ఒక సినిమా ఇంత వరకూ సెట్స్ మీదకు వెళ్ళలేదు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఆ సినిమా అనుకున్న ప్రకారం చిత్రీకరణకు వెళ్ళలేకపోయింది. అయితే దానివల్ల  డేట్స్ వేస్ట్ అవడం పట్ల రష్మికా చాలా అసహనం వ్యక్తం చేసిందట. తీరా అసలు కారణం తెలిశాక.. ఆమె షాక్ అవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
‘ఛలో’తో రష్మికా ను టాలీవుడ్‌కి పరిచయం చేశాడు వెంకీ కుడుముల. తొలి సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఆ తర్వాత సినిమా ‘గీత గోవిందం’ కూడా సంచలన విజయం సాధించడంతో రష్మికా క్రేజ్ అమాంతం పెరిగింది. ఆ తర్వాత నానీ సరసన ‘దేవదాస్’‌లో నటించిన రష్మికాకి ఆ సినిమా రిజల్ట్ నిరాశ పరిచినా.. అవకాశాలు మాత్రం ఆగలేదు. ఈ నేపథ్యంలోనే రష్మికకు యంగ్ హీరో నితిన్ సరసన నటించే ఛాన్స్ దక్కింది. తన సినిమా గురువు లాంటి వెంకీ కుడుముల అడగడంతో ఈ సినిమాకోసం బల్క్ డేట్స్ కేటాయించిందట. అయితే నితిన్‌కు భుజానికి గాయం తగలడంతో సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు.ఆ విషయం తెలియక రష్మిక చిరాకు పడింది.
ఇటీవల నితిన్ గాయం సంగతి తెలుసుకొని ఆశ్చర్యపోవడం రష్మిక వంతైందట. ఆ సినిమా ఎంతకీ సెట్స్ మీదకు వెళ్ళకపోవడంతో డేట్స్ వేస్ట్ అవుతున్నాయని తెగ బాధపడిన రష్మిక ఇప్పుడు మరీ ఫీలవుతోందట. నితిన్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటోందట. అసలు తనకి నితిన్ సంగతి తెలియకపోవడం వల్లే ఆ సినిమా మీద అసహనం వ్యక్తం చేశానని రష్మిక సోషల్ మీడియాలో వాపోయింది. 
నీట కాలుష్యం పట్ల అవగాహన !
నీటి కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేశారు రష్మిక. కర్ణాకటలోని అతి పెద్ద చెరువైన బెళ్లందూర్‌లో ఫోటో షూట్‌ చేశారు. అనంతరం ఈ ఫోటోలను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘గొప్ప టీమ్‌తో కలిసి నీట కాలుష్యం పట్ల అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాను. బెల్లందూర్‌ చెరువు దగ్గరకు వచ్చి చూసే వరకూ దీని పరిస్థితి ఇంత దారుణంగా ఉందని అనుకోలేదు. కొన్నేళ్ల క్రితం వరకూ ఈ చెరువు ఎంత అందంగా ఉండేదో గుర్తొచ్చి నా గుండె బద్దలయ్యింది. ప్రతి చోట ఇలానే ఉంది. ఇలాంటి చోట ఉండాలని నేనైతే అనుకోను. మీతో పంచుకోవాలి అనిపించి చెబుతున్నా’ అంటూ రష్మిక ట్వీట్‌ చేశారు.