అందుకే నాన్‌స్టాప్‌గా ప్రయాణిస్తూనే ఉన్నా!

రష్మిక మందన్నా దక్షిణాది భాషల్లో ‘మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌’లా మారిపోయారు . మూడు భాషల్లో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది . ఒక సినిమా లొకేషన్‌ నుంచి మరో చోటుకి ప్రయాణం చేస్తూ… ఇంటికి వెళ్లడానికి కూడా తీరక దొరకడం లేదంటోంది రష్మిక… ‘‘నేను చేస్తున్న ఒక్కో సినిమా షూటింగ్‌ ఒక్కో చోట జరుగుతుంది. అందుకే నాన్‌స్టాప్‌గా ప్రయాణిస్తూనే ఉన్నాను. కన్నడ చిత్రం ‘పొగరు’ బెంగళూరులో జరుగుతోంది. అది పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో వేరే సినిమా. ఆ తర్వాత రాజమండ్రి వెళ్తాను. ఆ తర్వాత పొల్లాచ్చి.వచ్చే నెలలో యూరప్‌లో ఒక నెల షూటింగ్‌ చేయబోతున్నాను. ఇలా ప్రయాణం చేస్తూనే ఉన్నాను’’ అని తన షూటింగ్‌ షెడ్యూల్‌ వివరాలు చెప్పారు రష్మిక.
 
రష్మిక గత ఆరు నెలల్లో ఇంట్లో గడిపింది 22 గంటలేనట. ఇంటిని ఎంత మిస్‌ అవుతోందో చెబుతూ … ‘‘తీరిక లేకుండా పని చేస్తున్నాను. ఇంటి మీద బెంగ పెట్టుకున్నాను. ఒక్క రెండు రోజులు పూర్తిగా ఇంట్లో ఉండిపోవాలనుంది. ప్రస్తుతం అదొక్కటే కోరుకుంటున్నాను. మొన్న ఇంటి నుంచి వచ్చేస్తుంటే మళ్లీ ఎప్పుడొస్తావు? అని మా చెల్లి అడిగింది. తను పెరిగి పెద్దదవుతోంది..తనని మిస్‌ అవుతున్నాను. ఎప్పుడూ సూట్‌కేస్‌ రెడీగా పెట్టుకొని తిరుగుతున్నాను’’ అని అంటోంది రష్మిక.
హీరో కంటే ఎక్కువ పారితోషికం?
రష్మిక మందన తన పారితోషికాన్ని భారీగా పెంచినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అతి తక్కువ కాలంలోనే రష్మిక అగ్రకథానాయికగా పేరు తెచ్చుకుంది. దీంతో ఆమె నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని…పారితోషికాన్ని కూడా భారీగా పెంచిందని అంటున్నారు. ఈ విషయంపై రష్మిక తాను పారితోషికం పెంచలేదని చెబుతోంది. నాగచైతన్యకు జోడీగా నటించాలని కోరిన దిల్ రాజు వంటి నిర్మాతలకు పారితోషికం పెంచి చెప్పిందని.. రష్మిక చైతూ కంటే ఎక్కువ పారితోషికం అడిగినట్టు చెబుతున్నారు. ‘మజిలీ’ విజయం తరువాత నాగచైతన్య ఒక్కో సినిమాకు 5 కోట్ల వరకు పారితోషికంగా తీసుకుంటున్నారు. పూజా హెగ్డే వంటి నాయికలు అందులో సగం మాత్రమే తీసుకుంటోంది. దీనిపై రష్మిక తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిందని కొందరు అంటున్నారు .రష్మిక తాను పారితోషికం పెంచలేదని చెబుతోంది. తాను పారితోషికం పెంచనప్పటికీ, తనపై గిట్టని వారు దుష్ప్రచారం చేస్తున్నారని రష్మిత అంటోందట.