గుట్టు రట్టు చేస్తే ఎవరైనా ఊరుకుంటారా ?

రష్మిక మందనపై ‘సుల్తాన్’ సినిమా నిర్మాతలు ఆగ్రహంతో ఉన్నారు. తమ పర్మిషన్ లేకుండా తాను నటిస్తున్న సినిమా పేరును రష్మిక బయటపెట్టింది. దీంతో నిర్మాతలు ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న సాండల్‌వుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న. ఇప్పటికే కన్నడ, తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్‌ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళనాట తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రష్మిక తమిళంలో ‘గీత గోవిందం’ తెచ్చి పెట్టిన పాపులారిటీతో కార్తీతో జత కట్టే అవకాశాన్ని దక్కించుకుంది. భాగ్యరాజ్‌ కన్నన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ను భారీ స్థాయిలో విడుదల చేయాలన్న ఆలోచనలో దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్, నిర్మాతలు ఉన్నారట.  ఈ క్రమంలో రష్మిక సోషల్ మీడియాలో  ‘సుల్తాన్’ సినిమా షూటింగ్ లో నాల్గోరోజు అంటూ పోస్టు పెట్టింది. దీంతో ఈ సినిమా పేరు ‘సుల్తాన్’ అని తెలిసిపోయింది. తమ అనుమతి లేకుండా ఇలా సినిమా టైటిల్ పై ప్రకటన చేయడం పై నిర్మాతలు రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది
 
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన రష్మిక.. ‘సుల్తాన్‌’ (#Sultan) అనే హ్యాష్ ట్యాగ్‌ను షేర్‌ చేశారు. దీంతో సినిమా టైటిల్ ఇదే అని ఫిక్స్‌ అయ్యారు ఫ్యాన్స్‌. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించకుండానే రష్మిక ఇలా టైటిల్ లీక్‌ చేయటంపై సోషల్ మీడియాలో సెటైర్‌లు పడుతున్నాయి.ఈ సినిమాతో పాటు తెలుగులో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో కూడా హీరోయిన్‌ అన్న ప్రచారం జరుగుతోంది.
 
ఆశ నిరాశగా మిగిలింది
విజయ్‌ సరసన నటించే అవకాశం ఈ అమ్మడి కోసం ఎదురు చూస్తుందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ విషయమై మీడియా అడిగితే … ‘ఆగండయ్యా ఇంకా కన్ఫార్మ్‌ కాలేదు’ అంటూ చిరు కోపంతో వారిని కట్డడి చేసింది. ఆవిధంగా విజయ్‌కు జంటగా నటించే చిత్రం గురించి చర్చలు జరుగుతున్నట్లు రష్మిక మీడియాకు వెల్లడించింది.అయితే ఆమెకు షాక్ తగిలింది. విజయ్‌ 64వ చిత్రంలో నటి కియారా అద్వానీ ని ఫైనలైజ్ చేసినట్లు తాజా సమాచారం. రష్మిక విజయ్‌తో నటించే అవకాశం తనకే వస్తుందని ఆశలు పెట్టుకుంది. అలాంటిది నటి కియారా తన కాల్‌షీట్స్‌ను సర్దుబాటు చేసుకుని విజయ్‌ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. దీంతో రష్మిక ఆశ నిరాశగా మిగిలిపోయిందని బాధపడుతోందట. ప్రస్తుతం విజయ్‌ ‘బిగిల్‌’ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తన 64వ చిత్రం విజయ్‌ నటించనున్నారు