చిన్న సినిమాల నిర్మాతగా మారుతోందా?

రష్మిక తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం సినీ పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. టాలీవుడ్‌లో అగ్రహీరోల సరసన వరుస అవకాశాలతో టాప్‌ హీరోయిన్‌ గా ప్రేక్షకులను అలరిస్తోంది రష్మికా మందన్నా.’ఛలో` సినిమాతో టాలీవుడ్ చేరిన కన్నడ భామ రష్మికా మందన్న అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌ అయ్యింది. ఈ ఏడాది ఆమె నటించిన `సరిలేరు నీకెవ్వరు’,`భీష్మ` సినిమాలు విజయాలు సాధించాయి.
“కొత్త తరహా కథల కోసం చూస్తున్నానని, ఎవరి దగ్గరయినా మంచి కథలు ఉంటే తనకి మెయిల్ చేయ”మని రష్మిక ఇటీవల ప్రకటించింది. నిర్మాతగా మారి, చిన్న సినిమాలను నిర్మించాలని రష్మిక తీసుకున్న తాజా నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు, తన దగ్గర చాలా చిన్న టీం ఉందని, కథలు చదివి అభిప్రాయం చెప్పడానికి సమయం పడుతుందని.. అంతవరకు ఓపికతో ఉండాలని కోరింది. నిర్మాతగా మారడం కోసమే రష్మిక ఇలా ప్రకటించిందని వార్త బయటకు వచ్చింది. రష్మిక నిర్ణయంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు మాత్రం అనవసరంగా చేతులు కాల్చుకోవడం ఎందుకని కామెంట్ చేస్తున్నారు
 
కొత్త పాత్రలు చేయడానికే ఇష్టపడతా!
నటిగా మంచి స్థాయికి చేరుకున్నారు.. భవిష్యత్‌లో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు రష్మిక బదులిస్తూ….‘‘నేను ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు చేయడానికే ఇష్టపడతాను. ప్రయోగాత్మక పాత్రలు చేస్తే నటిగా కొత్త మెళకువలు నేర్చుకోవచ్చు. ఇంకా కెరీర్‌ స్టార్టింగ్‌లోనే ఉన్నాను కాబట్టి ఏవైనా తప్పులు జరిగితే సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది.
 
తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ కార్తీ సరసన ‘సుల్తాన్‌’ చిత్రంలో నటిస్తున్న రష్మికని మరో బంపర్‌ ఆఫర్‌ వరించింది. తమిళ స్టార్‌ సూర్య సరసన మెరిసే అవకాశాన్ని సైతం సొంతం చేసుకుంది. ‘సింగం’ వంటి సూపర్‌ హిట్‌ సిరీస్‌ని అందించిన హరి దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో కథానాయికగా రష్మికనే ఫైనల్‌ చేశారు. ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ అన్నదమ్ములు సూర్య, కార్తీలతో రష్మిక చేయడం విశేషం. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలోనూ అల్లు అర్జున్‌ సరసన నటిస్తూ… కన్నడలో ‘పొగరు’ సినిమాలోనూ నటిస్తూ బిజీగా ఉంది.