ప్రయోగాలొద్దు !…… కామెడీయే ముద్దు !!

రవితేజ చిత్రాలంటేనే వినోదానికి పెట్టింది పేరు. మాస్‌కు కావల్సిన అంశాలతో పాటు వినోదానికి కూడా సమాన ప్రాధాన్యతనిచ్చి.. ఎన్నో విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కొంత కాలానికి రవితేజ చిత్రాలు రొటీన్ అవడంతో.. అతడ్ని పరాజయాలు చుట్టుముట్టాయి. అయితే లేటెస్ట్‌గా రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ చిత్ర విజయోత్సాహంతో ఉన్న రవితేజ.. మళ్లీ కామెడీ ఎంటర్ టైనర్స్ మీదే దృష్టి సారిస్తున్నాడని తెలుస్తోంది. ఆ క్రమంలోనే తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట..ఇంతకు ముందు తనతో ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ వంటి హిట్ మూవీస్ రూపొందించిన దర్శకుడు శ్రీను వైట్లతోనే మరోసారి జతకట్టనున్నాడు రవితేజ. ఇదే రవితేజ, శ్రీను వైట్ల తదుపరి చిత్రమని తెలుస్తోంది.
 నిజానికి రవితేజ హీరోగా రెండు చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. తమిళంలో ఘనవిజయం సాధించిన జయం రవి చిత్రం ‘భోగన్’ను రవితేజతో రీమేక్ చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అలాగే విక్రమ్ సిరి అనే కొత్త దర్శకుడితో ‘టచ్ చేసి చూడు’ అనే సినిమా నిర్మాణంలో ఉంది. అయితే ‘రాజా ది గ్రేట్’ సక్సెస్ అయిన వెంటనే రవితేజ ఆలోచనా విధానంలో మార్పువచ్చింది. ఆ సినిమా స్ఫూర్తితో మళ్లీ వినోద ప్రధాన చిత్రాలవైపే దృష్టిసారించాడు రవితేజ… దాంతో లైన్‌లో పెట్టిన రెండు చిత్రాల్ని పక్కన పెట్టి శ్రీను వైట్లతో తదుపరి చిత్రాన్ని చేయడానికి నిర్ణయించుకున్నాడట. మరి రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ ఈ సారి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి…