యూత్ ని అలరించే ..’రాయలసీమ లవ్ స్టొరీ’ చిత్ర సమీక్ష

రేటింగ్ : 3/5

A 1 ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్
“రాయలసీమ లవ్ స్టోరీ”
సెప్టెంబర్ 27 న విడుదల
నటీనటులు :
వెంకట్ ( హీరో ),హృశాలి ( హీరోయిన్ ), పావని ( హీరోయిన్ )
పృథ్వీ ,నాగినీడు, జీవా,రఘు, మిర్చి మాధవి, జబర్దస్త్ రాజమౌళి
గెటప్ శ్రీను, జబర్దస్త్ చంద్రం, తాగుబోతు రమేష్, భద్రం
 
సాంకేతిక వర్గం :
సంగీతం : శ్రీ సాయి యేలేందర్,
ఛాయాగ్రహణం : రామ్ మహేందర్
ఎడిటర్ : వినోద్ అద్వైత్, ఆర్ట్ డైరెక్టర్ : రమేష్
ప్రొడక్షన్ డిజైనర్ : ఎస్ . వలి
నిర్మాతలు : రాయల్ చిన్నా – నాగరాజు
కథ , స్క్రీన్ ప్లే , మాటలు , దర్శకత్వం : రామ్ రణధీర్
 
పంచలింగాల బ్రదర్స్ రామ్ రణధీర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘రాయలసీమ లవ్ స్టొరీ’. సినిమా విడుదలకు ముందు టైటిల్ పట్ల వివాదం చెలరేగినప్పటికీ అన్ని అడ్డంకులను అధిగమించి విడుదలయ్యింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉందా? లేదా ? అన్నది చూద్దాం…
 
కధలోకి వెళ్తే… రాయలసీమ కు చెందిన కృష్ణ ( వెంకట్ ) ఎస్ ఐ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. తన మిత్రుడు శృంగారం ( నల్ల వేణు) తో కలిసి ఓ ఇంట్లో అద్దెకు దిగుతాడు. అయితే ఇంటి కిరాయి కట్టకపోవడంతో ఓనర్ ఇల్లు ఖాళీ చేయిస్తాడు. అదే సమయంలో డాక్టర్ పల్లవి …తన ఇంట్లో కృష్ణ ,శృంగారం లకు ఆశ్రయం ఇస్తుంది. కృష్ణ పల్లవి ఇంటి ఎదురుగా ఉండే రాధ ( హృశాలి) ని చూసి లవ్ లో పడతాడు. రాధ కూడా కృష్ణ ని ప్రేమిస్తుంది. అయితే అనూహ్యంగా రాధ వివాహం మరొకరితో నిర్ణయించబడటంతో పద్మ లాగే రాధ కూడా తనను మోసం చేసిందని కుమిలిపోతుంటాడు కృష్ణ. అసలు పద్మ ఎవరు ? కృష్ణ ప్రేమించింది ఎవరిని ? చివరకు ఏమైంది? అన్నది సినిమాలోనే చూడాలి….
 
ఆకట్టుకునేవి :
వెంకట్ నటన
హృశాలి గ్లామర్
వినోదం
పాటలు
దర్శకత్వం
 
నటీనటులు ఎలా చేసారు :
హీరోగా నటించిన వెంకట్ కు మంచి భవిష్యత్తు ఉంది. ఇది తొలి చిత్రమే అయినప్పటికీ ఎంతో అనుభవమున్న వాడిలా అన్ని ఎమోషన్స్ పలికిస్తూ నటించాడు . ఎమోషనల్ సీన్స్ లోనే కాకుండా శృంగార సన్నివేశాల్లో..యాక్షన్ సీన్స్ లో కూడా అద్భుతం గా చేసాడు .హీరోయిన్ లు పావని , హృశాలి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. పావని నటనతో ఆకట్టుకుంటే …హృశాలి శృంగార సన్నివేశాల్లో తన అందాలతో అలరించింది . లిప్ లాక్ లతో వెంకట్, హృశాలి యూత్ ని ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వి , నాగినీడు, మిర్చి మాధవి , నల్లవేణు ,జబర్దస్త్ బ్యాచ్ కొమరం, గెటప్ శ్రీను ,రాజమౌళి తమ పాత్రల్లో మెప్పించారు.
 
సాంకేతిక నైపుణ్యం :
తక్కువ బడ్జెట్ లోనే చేసినప్పటికీ క్వాలిటీ పరంగా రాజీపడకుండా పంచలింగాల బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక దర్శకుడు రామ్ రణధీర్ విషయానికి వస్తే …యూత్ కి సందేశం ఇస్తూనే వాళ్లకు కావాల్సిన మసాలా ని అందించాడు. ఇది మొదటి సినిమానే అయినప్పటికీ… యువతను ఆకట్టుకునే అన్ని అంశాలతో ‘రాయలసీమ లవ్ స్టొరీ’ చిత్రాన్ని రూపొందించాడు. తనకు కావాల్సిన నటనని నటీనటుల నుండి రాబట్టుకున్నాడు. డైలాగ్స్ కూడా యూత్ కి బాగా నచ్చడం ఖాయం. కొన్నిచోట్ల పరిధి దాటి డైలాగ్స్ ని రాసినప్పటికి.. అవి యువతని మెప్పించేలా ఉన్నాయి. నాలుగు పాటలు యూత్ ని విశేషంగా అలరించేలా ఉన్నాయి. ‘నువ్వంటే పిచ్చిపిచ్చి’.. ‘ముద్దు తొలి ముద్దు’ అనే పాటలు హైలెట్ గా నిలిచాయి. నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా చేసి ఉంటే మరింత బాగుండేది .
 
చివరికి చెప్పేదేమిటంటే :
రాయలసీమ లవ్ స్టొరీ యూత్ ని అలరించే సినిమా