‘రాయలసీమ లవ్ స్టోరీ’ టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్

ఏ వన్ ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ పతాకంపై రామ్ రణధీర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా – నాగరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ” రాయలసీమ లవ్ స్టోరీ ”. వెంకట్ ని ,హృశాలి గోసవి ని  హీరోహీరోయిన్లుగా  పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం లో తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన పావని మరో హీరోయిన్ గా నటిస్తోంది . నాగినీడు , నల్లవేణు , పృథ్వీ , జీవా , తాగుబోతు రమేష్ , అదుర్స్ రఘు , గెటప్ శ్రీను , మధుమణి ,మిర్చి  మాధవి ,జబర్దస్త్ కొమరం ,రాజమౌళి , సన్నీ , భద్రం , ప్రసన్న కుమార్ తదితరులు నటిస్తున్నారు.ఇటీవ‌ల ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల చేతులు మీదుగా రిలీజైన ఫ‌స్ట్ లుక్ ,టీజ‌ర్ కు బ్ర‌హ్మండమైన రెస్పాన్స్ వ‌చ్చింది..ఈ సంద‌ర్భంగా ….
దర్శకులు రామ్ రణధీర్ మాట్లాడుతూ… ” నాపై పూర్తి నమ్మకంతో ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారు నిర్మాతలు , వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుతమైన ఔట్ ఫుట్ వచ్చింది ,నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు నా కృతఙ్ఞతలు  . యువతని టార్గెట్ చేస్తూ రూపొందించిన మా రాయలసీమ లవ్ స్టోరీ చిత్రం తప్పకుండా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది . మా చిత్రంలో అద్భుతమైన పాటలున్నాయి , ఎలేందర్ ఇచ్చిన ట్యూన్స్ ట్రెండ్ అవ్వడం ఖాయం అన్నారు.. ఇటీవ‌ల రిలీజైన మోష‌న్ పోస్ట‌ర్ ,టీజ‌ర్ కు బ్ర‌హ్మండైన రెస్పాన్స్ వ‌స్తోంది..మేము ఉహించిన‌దానికంటే  ఎక్కువ రెస్పాన్స్ రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు…
చిత్ర నిర్మాతలు రాయల్ చిన్నా , నాగరాజు లు మాట్లాడుతూ… ” రామ్ రణధీర్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాం . సినిమా రష్ చూసుకున్నాం. చాలా బాగా వచ్చింది . ఈరోజుల్లో సినిమాలు ఎక్కువగా చూసేది యువతరమే కాబట్టి వాళ్లకు నచ్చే విధంగా ఈ సినిమాని రూపొందించడం జరిగింది . టీజ‌ర్ కు వ‌చ్చిన రెస్సాన్స్ చూసి సినిమా పై మ‌రింత కాన్పిడెన్స్ పెరిగింద‌న్నారు.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి . త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేస్తామ‌ని అన్నారు…