అతనికి 40 కోట్లు … సినిమాకి 40 కోట్లు !

 ‘ప‌వ‌న్‌కు ఏకంగా 40 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశార‌ట నిర్మాత‌లు. ప‌వ‌న్ అంగీక‌రిస్తే ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్‌తో క‌లిపి రూ.80 కోట్ల బ‌డ్జెట్‌తో సినిమా రూపొందించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌’….

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అనూ ఇమ్మానుయేల్‌, కీర్తి సురేశ్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమాకు `అజ్ఞాత‌వాసి` అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ‌రితో చేయ‌బోతున్నాడ‌నేది ఇంకా అయోమ‌యంగానే ఉంది. అస‌లు సినిమా చేసే ఆలోచ‌న ఉందో, లేదో కూడా తెలియ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన గ్యాసిప్ విన‌బడుతోంది…

ప‌వ‌న్‌తో సినిమా చేసేందుకు `మైత్రీ మూవీస్‌` చాలా రోజుల నుంచి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తోంది. ఇందుకోసం ప‌వ‌న్‌కు ఏకంగా 40 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశార‌ట నిర్మాత‌లు. ప‌వ‌న్ అంగీక‌రిస్తే ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్‌తో క‌లిపి రూ.80 కోట్ల బ‌డ్జెట్‌తో సినిమా రూపొందించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ మేర‌కు ముందుగానే ప‌వ‌న్‌కు రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు కూడా సిద్ధ‌ప‌డుతున్నార‌ట‌. ఎన్నిక‌ల ముందు ఈ సినిమా విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఈ ఆఫ‌ర్‌కు ప‌వ‌న్ ఆయోమ‌యంలో ప‌డ్డాడ‌ట‌. ఏమి చేయాలో డిసైడ్ చేసుకోలేక‌పోతున్నాడ‌ట‌. నిజానికి త్రివిక్ర‌మ్ సినిమా త‌ర్వాత `జ‌న‌సేన‌` ప‌నుల‌తో బిజీ కావాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడు.  ఈ ఆఫ‌ర్‌కు అంగీక‌రిస్తే మాత్రం ద‌క్షిణాదిన సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అంత స్థాయిలో రెమ్యున‌రేషన్ అందుకున్న హీరోగా ప‌వ‌న్ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ చిత్రం పలు సంచలనాలు రేపడం ఖాయం!