పెళ్లి చేసుకోవాల్సిన వ‌య‌సొచ్చేసింది !

“పెళ్లి చేసుకోవాల్సిన వ‌య‌సొచ్చేసింది”…అని అంటోంది రెజీనా. తెలుగుతోపాటు మిగిలిన ద‌క్షిణాది భాష‌ల్లో కూడా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది రెజీనా.అందంతోపాటు అభిన‌యంలోనూ మంచి మార్కులు సంపాదించుకుంది.తెలుగులో ప‌లు హిట్ సినిమాల్లో న‌టించింది. రెజీనా ప్ర‌స్తుతం త‌మిళ సినిమాల‌పై త‌న దృష్టి పెట్టింది. ఆమె న‌టించిన `7`  త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. తాజాగా హైద‌రాబాద్ వ‌చ్చిన రెజీనా త‌న పెళ్లి గురించి స్పందించింది….
“పెళ్లి గురించిన ఆలోచ‌న అయితే ఉంది. ఇప్పుడు నా వ‌య‌సు 28. ఇది పెళ్లి చేసుకోవాల్సిన వ‌య‌సే. త‌ప్ప‌కుండా పెళ్లి చేసుకోనే ఆలోచ‌న ఉంది. అయితే ఎప్పుడ‌నేది తెలియ‌దు. ఇక‌, నేను ఫ్రై ఫుడ్‌కు కాస్త దూరంగా ఉంటా. వ‌ర్షం పడుతున్న‌ప్పుడు మాత్రం అయిల్ ఫుడ్ తినాల‌ని అనిపిస్తుంటుంది. నాకు బేకింగ్ బాగా ఇష్టం. నాన్ వెజ్ వండ‌డం కూడా వ‌చ్చు” అని రెజీనా చెప్పింది.
 
“నాకు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది స్నేహితులున్నారు. అయితే సాయిధ‌ర‌మ్ తేజ్‌, సందీప్ కిష‌న్, ర‌కుల్ ప్రీత్ సింగ్‌ల‌తో కొంచెం ఎక్కువ క్లోజ్‌గా ఉంటాను. నేను తెలుగుతోపాటు ద‌క్షిణాదిలోని ప‌లు భాష‌ల చిత్రాల్లో న‌టిస్తున్నాను. అన్నీ వేటిక‌వే ప్ర‌త్యేక‌మైన‌వి. అంద‌రూ న‌న్ను ప్రేమ‌గా చూసుకుంటున్నారు. కేవ‌లం హీరోయిన్‌గానే కాకుండా మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకోవాల‌నేది నా కోరిక‌” 
డిఫరెంట్‌ షేడ్స్‌ తో వెరైటీ క్యారెక్టర్‌
బ్యూటీ విత్‌ బ్రెయిన్‌. వేసే ప్రతీ అడుగు చాలా తెలివిగా వేస్తారట. అసలు అర్థం కాని ఒక వెరైటీ క్యారెక్టర్‌. ఇలాంటి డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టరే పోషిస్తుస్తోంది రెజీనా. తమిళంలో రెజీనా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ కోసమే ఈ డిఫరెంట్‌ రోల్‌. అరవింద స్వామితో దర్శకుడు రాజా పాండీ తెరకెక్కిస్తున్న ఓ థ్రిల్లర్‌ చిత్రంలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తోంది రెజీనా.కేవలం పాటల్లో వచ్చి కాలు కదిపే విధంగా కాకుండా కథను మలుపు తిప్పేలా రెజీనా పాత్రను దర్శకుడు రూపొందించారట. నటనకు ఎక్కువ స్కోప్‌ ఉన్న పాత్ర కావడంతో రెజీనా వెంటనే ఈ పాత్రను ఒప్పుకుందట.