అందాల భామలు రీ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు !

‘గ్లామర్‌ క్వీన్‌’ నగ్మా… అందాల హీరోయిన్స్‌గా ఒకప్పుడు అలరించిన భామలు ఇప్పుడు అత్త, అమ్మ పాత్రల్లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే నదియా, ఖుష్బూ, మీనా, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్స్‌ సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో సీనియర్‌ నటి చేరనున్నారు. గ్లామర్‌ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నగ్మా రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు.
 
ఇప్పటికే నదియా, ఖుష్బూలను పవర్‌ ఫుల్‌ రోల్స్‌లో చూపించి మెప్పించిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే నగ్మా రీ ఎంట్రీ ఇవ్వనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్‌ ఈ సినిమాలో నగ్మా, బన్నీ తల్లి పాత్రలో కనిపించనున్నారట. 2002 లో ‘నిను చూడక నేనుండలేను’ సినిమాతో చివరిసారిగా తెలుగు తెరపై కనిపించిన నగ్మా ఇన్నేళ్ల తరువాత ఎంట్రీ ఇస్తుండటంఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందంటున్నారు.
రేణూ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ !
పవన్‌ కళ్యాన్‌ సరసన ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్‌ పరిచయం అయిన భామ రేణూ దేశాయ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రేణూ తరువాత పవన్‌తోనే ‘జానీ’ సినిమాలో కలిసి నటించారు. పవన్‌ను వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు పూర్తిగా దూరమైన రేణూ దేశాయ్‌ తరువాత పవన్‌ నుంచి విడిపోయాక తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా దూరమయ్యారు.
 
ఇటీవల ఓ టీవీ షోతో తెలుగు ప్రజలను పలకరించిన రేణూ, త్వరలో సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా రీ ఎంట్రి ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కనున్న బయోగ్రాఫికల్‌ మూవీ తో రేణూ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ‘దొంగాట’ ఫేం వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టూవర్ట్‌పురం గజదొంగ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.