సినీ రచయిత్రిగా పరిచయం చేసుకునేందుకు ఇష్టపడతా !

చిన్నప్పటి నుంచీ తనకు కవితలు రాసే అలవాటు ఉందని, అయితే గత కొంతకాలం నుంచి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నానని నటి రేణు దేశాయ్ చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తాను రాసిన షార్ట్ స్టోరీస్, కవితలకు మాజీ భర్త పవన్ కల్యాణ్ ఫస్ట్ రీడర్ అని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి రైటర్‌కు తొలి పాఠకుడు అంటూ ఎవరూ ఉండరు. అయితే పవన్ మాత్రం నా పనిని ఇష్టపడటంతో పాటు ఎంతగానే ప్రొత్సహించేవారని తెలిపారు.తాను షార్ట్ స్టోరీస్ గానీ, కవితలు లాంటివి ఏది రాసినా పవన్ వాటిని చదివి తన అభిప్రాయాన్ని చెప్పేవారని రేణు గుర్తుచేసుకున్నారు. ఫ్రెండ్స్, సన్నిహితులు ఇచ్చే విలువైన సలహాలు, సూచనలతో తాను మరింత ముందుకు వెళ్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

‘స్కూలు రోజుల నుంచి కలానికి పని పెట్టడం అలవాటు. కానీ నేను రాసిన కవితలు, లఘు కథలను 2014 నుంచి బహిర్గం చేస్తున్నాను. మొదట్లో నాకు సోషల్ మీడియా ఖాతాలు లేకపోవడంతో వాటిని పోస్ట్ చేయలేకపోయా. మూవీ బిజినెస్ స్టార్ట్ చేశాక మా పీఆర్ టీమ్ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేశారు. 2015లో తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడైతే నాలుగైదు డైరీలు నింపేశాను. కొంతకాలానికి ఆ డైరీల్లో రాసుకున్న కవితలను ట్విట్టర్లో పోస్ట్ చేయడం ప్రారంభించాను. కొన్నింటికి చాలా మంచి కాంప్లిమెంట్స్ రావడంతో నాలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందని’ రేణు దేశాయ్ వివరించారు.

 మోడల్‌గా కెరీర్ ఆరంభించిన రేణు దేశాయ్ తర్వాత టాలీవుడ్‌లో పవన్ సరసన నటించి రంగుల ప్రపంచానికి పరిచయమైన విషయం తెలిసిందే. అయితే తన మూవీలలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆమె పని చేశారు. కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె.. ప్రస్తుతం మరాఠీ మూవీలతో బిజీగా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో రేణుదేశాయ్ దర్శకురాలిగా, నిర్మాతగానూ రాణించేందుకు కృషి చేస్తున్నారు. కవయిత్రిగా కంటే తనను తాను సినీ రచయిత్రిగా పరిచయం చేసుకునేందుకు ఇష్టపడతానని రేణు పేర్కొన్నారు.