సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తే అసలు కారణం?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ ..సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తే త‌న కుమారుడి మ‌ర‌ణానికి కార‌ణ‌మంటూ పాట్నాలో కేసు న‌మోదు చేశాడు. ఐపీసీ 342, 342, 380, 406, 420, 306 సెక్ష‌న్ల కింద రియా ఫ్యామిలీపై కేసు న‌మోదు అయ్యింది.34 ఏళ్ల సుశాంత్ జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రా ఇంట్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. సుశాంత్ మ‌ర‌ణంపై అనుమానాలు ఉన్నాయ‌ని, సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని రాజ‌కీయ‌వేత్త‌లు, ప్ర‌ముఖులు డిమాండ్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో బందుప్రీతి కార‌ణంగా అవ‌కాశాలు రాక సుశాంత్ సూసైడ్ చేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కేసులో బాలీవుడ్ ప్ర‌ముఖుల్ని కూడా విచారించారు.
సుశాంత్‌ను మాన‌సిక క్షోభ‌కు గురిచేసేంది రియానే అంటూ కృష్ణ‌కుమార్ త‌న ఫిర్యాదులో పేర్కొంటూ.. మెంట‌ల్ హెల్త్ కేర్ యాక్ట్ ప్ర‌కారం .. రియాపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. అద్భుతమైన కెరీర్‌తో దూసుకువెళ్తున్న సుశాంత్‌.. అక‌స్మాత్తుగా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డానికి రియానే కార‌ణ‌మంటూ..రియా చ‌క్ర‌వ‌ర్తి, త‌న ఫ్యామిలీతో క‌లిసి చేసిన ప‌న్నాగాల‌కు సుశాంత్ బ‌లైన‌ట్లు త‌న ఫిర్యాదులో కృష్ణ‌కుమార్ ఆరోపించారు.
ఆస్తుల‌ను దొంగ‌లించాలని కుట్ర‌!
సుశాంత్‌తో రియాకు ప‌రిచ‌యం ఏర్ప‌డినప్ప‌టి నుంచి ‘సుశాంత్ స్నేహితురాలిని’ అంటూ ఆమె చెప్పుకు తిరిగింది. టీవీ కెరీర్ మొద‌లుపెట్టిన రియా.. సినీ అవ‌కాశాల కోసం సుశాంత్‌ను వాడుకున్న‌ట్లు కృష్ణ‌కుమార్ ఆరోపించారు. సుశాంత్‌కు ఉన్న కాంటాక్ట్స్‌ను వాడుకోవాల‌న్న ఉద్దేశంతోనే.. అత‌న్ని ట్రాప్ చేసిన‌ట్లు రియాపై కేసు ఫైల్ చేశారు. రియా కుటుంబ‌స‌భ్యులు కూడా సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రియా పేరెంట్స్ కూడా సుశాంత్ ఆస్తుల‌ను దొంగ‌లించాలని కుట్ర‌ చేసిన‌ట్లు ..సుశాంత్ డ‌బ్బు మీద ఆశ‌తోనే వాళ్లు త‌న కుమారుడి ప్ర‌తి విష‌యంలో జోక్యం చేసుకునేవార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ 15 కోట్లు ఎక్క‌డికి వెళ్ళాయి?
సుశాంత్ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న 15 కోట్లు ఎక్క‌డికి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాయో తెలియాల్సి ఉంద‌ని కృష్ణ‌కుమార్ ..ఈ అంశం పై ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని పోలీసుల్ని కోరారు. రియా త‌న పేరెంట్స్‌తో క‌లిసి సుశాంత్‌ను ఒప్పించి.. త‌న స్వంత ఇంటిని వ‌దిలేలా చేశారని ..త‌న ఇంట్లో భూతాలు ఉన్నాయ‌ని భ‌య‌పెట్టి.. ముంబై స‌మీపంలో ఉన్న ఓ రిసార్ట్‌లో ఉండే విధంగా సుశాంత్‌ను వేధించార‌ని కృష్ణ‌కుమార్ ఆరోపించారు. త‌న ప‌న్నాగం ప్ర‌కార‌మే కొంద‌రు మానసిక వైద్యుల‌తో సుశాంత్‌కు చికిత్స ఇప్పించే ప్ర‌య‌త్నం రియా చేసిన‌ట్లు..డాక్ట‌ర్ల‌తో ఒప్పందం కుదుర్చుకుని రియా ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు సుశాంత్ తండ్రి త‌న ఫిర్యాదులో ఆరోపించారు .బాంద్రాలోని త‌న ఇంట్లో సుశాంత్ మ‌ర‌ణించ‌డానికి వారం ముందే రియా అత‌ని ప‌ర్స‌న‌ల్ వ‌స్తువుల్ని ఎత్తుకెళ్లిన‌ట్లు.. సుశాంత్ రూమ్‌లో ఉన్న న‌గ‌దు, ల్యాప్‌టాప్‌, ఏటీఎం కార్డు,ఇత‌ర విలువైన డాక్యుమెంట్ల‌ను రియా తీసుకువెళ్లిన‌ట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
వ్య‌వ‌సాయం చేసుకోవాల‌నుకున్నాడు!
సుశాంత్‌ ఓద‌శ‌లో సినిమాల‌ను వ‌దిలి వేయాల‌ని అనుకున్నాడ‌ని, కూర్గ్‌లో సెటిల్ అయి..అక్క‌డే వ్య‌వ‌సాయం చేసుకోవాల‌నుకున్న‌ట్లు కృష్ణ‌కుమార్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. సుశాంత్‌ను రియా బ్లాక్‌మెయిల్ చేసింద‌ని, మానసికంగా సుశాంత్ బ‌ల‌హీనుడ‌న్న విష‌యాన్ని ప‌బ్లిక్ చేస్తాన‌ని భయపెట్టిందని ఫిర్యాదులో వెల్ల‌డించారు. సుశాంత్‌కు, త‌న కుటుంబానికి మ‌ధ్య రియా దూరాన్ని క్రియేట్ చేసింద‌ని కృష్ణ‌కుమార్ అన్నారు.