అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో, రాయ్ ల‌క్ష్మి కీల‌క పాత్ర‌లో ద్విభాషా చిత్రం

‘గుంటూరు టాకీస్’, రాజా మీరు కేక వంటి వినోదాత్మ‌క చిత్రాల‌ను, షూటింగ్ ద‌శ‌లో ఉన్న ప‌వ‌నిజం-2 వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆర్‌కె స్టూడియోస్ బ్యానర్ పై ఎమ్. రాజ్‌కుమార్ గారు నిర్మాత‌గా, నంది అవార్డు గ్ర‌హీత క‌ర్రి బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో.. ‘గీతాంజ‌లి’, చిత్రాంగ‌ద వంటి చిత్రాల‌తో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో,  ‘కాంచ‌న’ సినిమాతో మాంచి ఫేమ్ సంపాదించిన రాయ్ ల‌క్ష్మి కీల‌క పాత్ర‌ల్లో త్వ‌ర‌లోనే ఒక స‌రికొత్త‌ చిత్రం ప్రారంభం కానుంది. కొన్ని య‌దార్థ సంఘ‌ట‌నల ఆధారంగా, వినూత్న‌మైన సోష‌ల్ ఎలిమెంట్స్ తో కూడిన క‌థ‌తో, వినోదం మరియు ఉత్కంఠ‌భ‌రిత‌మైన క‌థ‌నంతో ఈ చిత్రం ఉండ‌బోతుంద‌ని,ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కించ‌నున్నామ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలియ‌ప‌రిచారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో రాయ్ ల‌క్ష్మి, సాయి కుమార్, న‌రేష్, శివ‌ప్ర‌సాద్, ధ‌న్‌రాజ్, జాకీ, అశోక్ కుమార్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి….సంగీతంః మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః పి.జి విందా

ఎడిటింగ్ః త‌మ్మిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ద‌త్తి సురేష్ కుమార్

ప్రొడ్యూస‌ర్ః ఎమ్. రాజ్‌కుమార్, క‌థ‌క‌థ‌నంద‌ర్శ‌క‌త్వంః క‌ర్రి బాలాజీ