పూజా హెగ్డే ప్రస్తుతం దక్షిణాన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ . ‘అరవింద సమేత వీరరాఘవ’ తో పూజా స్టార్ అయ్యింది. ఇప్పుడు సౌత్‌లోనే కాక బాలీవుడ్‌లో సైతం ఆమె హవా నడుస్తోంది. వరుసగా భారీ బడ్జేట్ చిత్రాలకు సైన్ చేసిన ఆమె చేతిలో ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా చిత్రాలే ఉన్నాయి. దీంతో తన క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పూజా హెగ్డేఇటీవల రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెచ్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నితిన్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న ఓ సినిమాకు పూజా సైన్ చేసినట్లు సమాచారం.ఈ మూవీకి గాను ఏకంగా రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. ఇందుకు నిర్మాతలు కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. దక్షిణాదిన భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ల లిస్ట్‌లోకి పూజా హెగ్డే కూడా చేరిపోయింది. 2012లో పూజా తమిళ సినిమా ‘ముగమూడి’ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2014లో వచ్చిన ఒక ‘లైలా కోసం’ మూవీతో తెలుగు తెరపై మెరిసింది.
12 మంది వస్తున్నారని విమర్శ !… పూజా హెగ్డేపై డైరెక్టర్, రోజా భర్త, ‘తమిళ సినీ ఫెడరేషన్ యూనియన్’ ప్రెసిడెంట్ ఆర్కే సెల్వమణి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న సెల్వమణి .. షూటింగ్ సెట్‌లో పూజా తీరుపై మండిపడ్డారు. సెల్వమణి మాట్లాడుతూ.. ‘పూజా హెగ్డె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో షూటింగ్ సెట్‌కు ఒకరిద్దరిని మత్రమే తన వెంట తీసుకుని వచ్చేది. కానీ ఇప్పుడు స్టార్‌డమ్ వచ్చాక తన టీంలో 12 మంది వస్తున్నారని విమర్శ పూజా హెగ్డేపై వస్తోంది . అంతమందిని సెట్‌కు తీసుకువస్తే నిర్మాతలు వారందరి ఖర్చులు భరించవలసి వస్తుంది. ఈ విధంగా పూజా నిర్మాతలపై అధిక భారం వేయడం ఎంతవరకు కరెక్ట్?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. పూజా హెగ్డేపై ఆమె నిర్మాతలకున్న అభిప్రాయమే సెల్వమణి మాటల్లో కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
అలా ఉండటం చాలా గ్రేట్ !… పూజా హెగ్డే దక్షిణాది భాషల్లో వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూనే బాలీవుడ్ తెరపై హంగామా చేస్తోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తోంది. ఇటీవల సల్మాన్ గురించి, అతని వ్యక్తిత్వం గురించి మాట్లాడింది… సల్మాన్ ఖాన్‌తో కలసి పూజా హెగ్డే ‘భాయిజాన్’ అనే మూవీలో నటించనుంది. అతిత్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న నేపథ్యంలో.. ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ గురించి చెబుతూ.. ‘లోపల ఒకలా, పైకి మరోలా కనిపించే వ్యక్తిత్వం ఆయనది కాద’ని చెప్పుకొచ్చింది. ‘కొందరు వ్యక్తులు తమ వ్యక్తిత్వాలకు ముసుగు వేసుకొని బయట మరోలా కనిపిస్తుంటారు కానీ సల్మాన్ ఖాన్ అలాంటి వారు కాద’ని తెలిపింది. ‘నిజాయితీగా, ముక్కుసూటిగా తమకు నచ్చినట్టు ఉండే మనిషి’ అని, ‘అలా ఉండటం చాలా గ్రేట్’, అలాంటి సల్మాన్ వ్యక్తిత్వం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది పూజా.
పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే.. అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రాబోతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు ప్రభాస్ సరసన పిరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తోంది. రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న ‘ఆచార్య’లో కూడా భాగమవుతోంది పూజా. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన ఆమె కనిపించనుంది. హిందీలో రణ్‌వీర్ సింగ్‌తో ‘సర్కస్’ మూవీ చేస్తోంది. సినిమాలతో ఇంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ రోల్ పోషిస్తూ అందాలు ఆరబోస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది .