‘సైలెన్స్ ప్లీజ్’ అంటున్న వల్లూరిపల్లి రమేష్

‘అశోక్ ‘(ఎన్టీఆర్), ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘గోపి గోపిక గోదావరి’ వంటి పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన ‘మహర్షి సినిమా’ అధినేత వల్లూరిపల్లి రమేష్ తాజాగా అందిస్తున్న చిత్రం ‘సైలెన్స్ ప్లీజ్’. కన్నడలో ఘన విజయం సాధించిన థ్రిల్లర్ ‘నిశ్శబ్ద-2’కి తెలుగు అనువాదంగా వస్తున్న ఈ చిత్రంలో రూపేష్ శెట్టి, ఆరాధ్య శెట్టి హీరోహీరోయిన్లు. దేవరాజ్ కుమార్ దర్శకత్వం వహించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
చిత్ర నిర్మాత వల్లూరుపల్లి మాట్లాడుతూ.. ‘స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే టెరిఫిక్ థ్రిల్లర్ ‘సైలెన్స్ ప్లీజ్’. డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. త్వరలో టీజర్ రిలీజ్ చేయనున్నాం. 2017లో కన్నడలో ఘన విజయం సాధించిన చిత్రాల్లో ఒకటైన ఈ చిత్రం తెలుగులోనూ సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు.
అవినాష్, పెట్రోల్ ప్రసన్న ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రానికి.. కెమెరా: వీనస్ మూర్తి, మ్యూజిక్: సతీష్ ఆర్యన్, నిర్మాత: వల్లూరిపల్లి రమేష్, దర్శకత్వం: దేవరాజ్ కుమార్