ఆ ఆటతోనే ప్రేమలో పడిపోయిందట !

”నేను స్పోర్ట్స్‌తో ప్రేమలో పడ్డా. ప్రతి రోజూ బ్యాడ్మింటన్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నా. అక్కడ చిన్నారులు ఆడుతున్న తీరు చాలా అద్భుతంగానూ, స్ఫూర్తివంతంగానూ ఉంటుంది. ఆ ఆట నాకు పాఠాలుగా ఉపయోగపడుతుంది. నేను శారీకంగా ఫిట్‌గా ఉన్నా..ఇక మానసికంగా దృఢంగా కావాలి. ఈ పాత్ర నాకు ఓ ఛాలెంజింగ్‌” అని శ్రద్ధా కపూర్‌ చెబుతుంది. ఇదంతా ఎందుకంటే… శ్రద్ధా ఇప్పుడు బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ పాత్ర పోషించబోతుంది.

సైనా జీవిత కథ ఆధారంగా ఈ స్పోర్ట్స్‌ చిత్రం రూపొందించేందుకు దర్శకుడు అమోల్‌ గుప్తా సన్నాహాలు చేస్తున్నాడు. ఆ పాత్రలో శ్రద్ధా మెప్పించేందుకు బ్యాడ్మింటన్‌ ప్రతి రోజూ ప్రాక్టీస్‌ చేస్తోంది. ఇప్పుడు ఆ ఆటతోనే ప్రేమలో పడిపోయిందట. ఇది మాత్రమే కాదు శ్రద్ధ స్వయంగా సైనా వెంటే ఉండి ఆమె ఆట తీరును నిశితంగా గమనిస్తోందట. ఆమె ఫీడ్‌ బ్యాక్‌ను తీసుకుంటుందట.

” సైనా చెప్పే సూచనలను తీసుకుంటున్నా. బ్యాడ్మింటన్‌కు సంబంధించిన నోట్స్‌ను ఒకరికొకరం ఎక్స్‌ఛేంజ్‌ చేసుకుంటున్నాం. నేను ప్రాక్టీస్‌ చేసిన సెషన్స్‌కు సంబంధించిన వీడియోస్‌ను సైనాతో షేర్‌ చేసుకుంటున్నా. వాటిపై తన ఫీడ్‌బ్యాక్‌ ఇస్తుంది. నేనింకా ఎలా బెటర్‌గా ఆడగలనో నిరంతరం చెబుతూనే ఉంటుంది” అని శ్రద్ధా కపూర్‌ చెప్పింది.