ఎక్కడ మొదలైందో.. అక్కడికే వచ్చాను !

‘భానుమతి ఒక్కటే పీస్‌.. హైబ్రిడ్‌ పిల్ల’ అని ‘ఫిదా’ సినిమాలో సాయిపల్లవి చేసిన అల్లరికి అందరూ ఫిదా అయిపోయారు. కానీ అంతకంటే ముందే మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో 2015లో కథానాయికగా పరిచయం అయ్యింది సాయిపల్లవి. ఈ చిత్రం తెలుగు రీమేక్‌ ‘ప్రేమమ్‌’లో నాగచైతన్య హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే మలయాళం ‘ప్రేమమ్‌’ చిత్రంలో నటించిన తర్వాత తెలుగులో (ఫిదా, ఎమ్‌సీఏ: మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి, పడి పడి లెచే మనసు), తమిళం (దియా, మారి 2 ఎన్‌జీకే: నంద గోపాల కుమరన్‌) సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది సాయిపల్లవి.
 
ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ మలయాళంలోకి వెళ్ళింది. ‘అథిరన్‌’ అనే మలయాళం సినిమా చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ‘‘నా సినిమా ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడికి వచ్చాను. మూడేళ్ల తర్వాత మలయాళంలో సినిమా చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు సాయిపల్లవి. ఫాహద్‌ ఫాజల్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వివేక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది.
 
నన్నెందుకు తిడుతున్నారు !
మహేష్‌ సినిమాకి సాయిపల్లవిని అనిల్‌ రావిపూడి అడిగారనీ, దానికి సాయి పల్లవి నో చెప్పిందనీ, ఆమెకి టెక్కు ఎక్కువైందనీ, ఇలాంటి కహానీలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా హల్‌ చల్‌ చేస్తున్నాయి. అసలు విషయమేమిటంటే…ఈ సినిమా కోసం సాయి పల్లవిని ఎవరూ అడగలేదట. తాను ఏమీ చెప్పకుండానే తనని అందరూ అంతలా ఎందుకు తిడుతున్నారో అర్ధం కావడంలేదంటూ సాయిపల్లవి తన సన్నిహితుల వద్ద వాపోతోందట. కథ విషయంలో జాగ్రత్తగా ఉంటాననీ, అలాగనీ మంచి అవకాశాన్ని వదులుకునేంత తెలివితక్కువదానిని కాదని సాయిపల్లవి చెబుతోందట. దీనర్థం నిజంగా మహేష్ సరసన అవకాశం వస్తే మాత్రం చేయడానికి సాయిపల్లవి సిద్ధంగా ఉన్నట్లేగా..!